టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. వాళ్లని ఓడించాలి: గంభీర్‌

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య​ నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కంటే కూడా టీమిండియా ఫోకస్‌ మొత్తం అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ కప్‌పైనే ఉంది. అయితే.. వరల్డ్‌ కప​ కంటే ముందు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో ఆడితే.. మంచి ప్రాక్టీస్‌ అవుతుందని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో జట్టులోని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో.. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాలకు తొలి రెండు వన్డేకలు రెస్ట్‌ ఇచ్చారు.

కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని యంగ్‌ టీమిండియా.. ఆస్ట్రేలియాను తొలి రెండు వన్డేల్లో​ ఢీకొట్టనుంది. పంజాబ్‌లోని మొహాలీలో భారత్‌-ఆసీస్‌ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా ఫోకస్‌ మొత్తం వరల్డ్‌ కప్‌ గెలవడంపైనే ఉండటం, భారత క్రికెట్‌ అభిమానులు సైతం టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో.. భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలవాలంటే చేయాల్సిన ముఖ్యమైన విషయం గురించి గంభీర్‌ తన ఆలోచనలను పంచుకున్నాడు.

టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాలని అన్నాడు. ‘ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టు. ముఖ్యంగా వరల్డ్‌ కప్‌ లాంటి బిగ్‌ ఈవెంట్స్‌లో వాళ్లు ఎంతో అద్భుతంగా ఆడుతుంటారు. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు​. అందుకే వరల్డ్‌ కప్‌ టోర్నీల్లోనే ఓడిస్తేనే టీమిండియా కప్పు కొడుతుంది. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లలో ఆస్ట్రేలియాను మేం ఓడించాం. వరల్డ్‌ కప్స్‌ గెలిచాం’ అంటూ పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా మ్యాచ్‌ జరగనుంది. మరి గంభీర్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ టైమ్ లో క్రికెట్ వదిలేసి.. వేరే పని చేద్దామనుకున్నా: సిరాజ్

Show comments