Gambhir: వీడియో: అందరూ గంభీర్ ను తిడతారు.. కానీ అతడెంత గొప్పవాడో మీరే చూడండి!

ధోనిని, విరాట్ కోహ్లీని ఎప్పుడూ విమర్శిస్తాడని గౌతమ్ గంభీర్ కు పేరుంది. దీంతో అందరూ గంభీర్ ను తిడతారు.. కానీ అతడెంత గొప్పవాడో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.

ధోనిని, విరాట్ కోహ్లీని ఎప్పుడూ విమర్శిస్తాడని గౌతమ్ గంభీర్ కు పేరుంది. దీంతో అందరూ గంభీర్ ను తిడతారు.. కానీ అతడెంత గొప్పవాడో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.

గౌతమ్ గంభీర్.. తరచుగా వార్తల్లో వినిపించే పేరు. పొద్దున లేస్తే ఇటు ధోనిని, అటు విరాట్ కోహ్లీని తిడుతూ ఉంటాడని గంభీర్ కు పేరు ఉండనే ఉంది. అయితే అతడు ఒక్కోసారి చేసే పనులు అదే విధంగా ఉంటాయనుకోండి అది వేరే విషయం. కాగా.. అతడు ఎప్పుడు ఇతరును విమర్శిస్తున్నాడని అతడి మనసును తప్పుగా అర్ధం చేసుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే గంభీర్ లో మనకు తెలియని మరో కోణం దాగుందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ ఈ వయసులో కూడా క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు అన్న ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పుకొచ్చాడు. తనను పార్ట్ టైమ్ ఎంపీ అనే వాళ్లు కూడా ఈ వీడియో చూస్తే మనసు మార్చుకోవాల్సిందే. ఇంతకీ ఈ ఇంటర్వ్యూలో గంభీర్ ఏం చెప్పాడో ఓసారి పరిశీలిద్దాం.

గౌతమ్ గంభీర్.. ఇటు MPగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఒక పక్క కామెంట్రీ, మరో పక్క క్రికెట్ లీగ్ లు ఆడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఒక్క నిమిషం వీడియోలో తనలో దాగున్న మరో గుణాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ..”నేను కామెంట్రీ చేస్తాను, క్రికెట్ లీగ్ లు ఆడుతాను. దాని ద్వారా వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చుపెడుతున్నాను. దాదాపు రూ. 3 కోట్లకు పైగా నా సొంత డబ్బులు ఖర్చుపెట్టి ప్రతీ రోజు 5 వేల మందికి భోజనం పెట్టిస్తున్నాను. ఈ విషయం నాకెంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. ఇక నన్ను పార్ట్ టైమ్ ఎంపీ అంటున్నారు. ఇలా అనడంలో నాకు నో ప్రాబ్లెం. ఎందుకుంటే ఆ 5 వేల మంది చేతుల్లో అన్నం ప్లేట్ ఇచ్చే సంతోషం నాకు ఇంకేది ఇవ్వదు. ఇక ఎంపీ నిధుల నుంచి నేను కమీషన్ తీసుకుని డబ్బులు దండుకోవచ్చు.. కానీ నాకు అలాంటి బతుకొద్దు” అంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

ఇక ప్రజలపై ఖర్చుపెట్టే ఆ 3 కోట్ల డబ్బును బ్రాండింగ్, సోషల్ మీడియాపై పెట్టి విపరీతమైన ఫాలోవర్లను తెచ్చుకోవచ్చు. కానీ నాకా ఉద్దేశం లేదని గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ధోని, విరాట్ ను తిట్టే గంభీరే ప్రజలకు తెలుసని, ఈ రోజుతో మీలో దాగున్న మరో గంభీర్ ను ప్రజలకు పరిచయం చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని నెజన్లు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ వయసులో ప్రాక్టీస్ చేసి, క్రికెట్ లీగ్ లు ఆడి అందులో వచ్చిన డబ్బును కడుపు నింపడం కోసం వినియోగిస్తున్న గౌతమ్ గంభీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments