SNP
Gautam Gambhir, Shreyas Iyer, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్న టీమిండియాతో మరో ప్రయోగం చేస్తున్నాడు గంభీర్. టీ20 సిరీస్‌లో వర్క్‌అవుట్ అయిన ఫార్ములానే వన్డే సిరీస్‌లో కూడా ఉపయోగించాలని చూస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, Shreyas Iyer, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్న టీమిండియాతో మరో ప్రయోగం చేస్తున్నాడు గంభీర్. టీ20 సిరీస్‌లో వర్క్‌అవుట్ అయిన ఫార్ములానే వన్డే సిరీస్‌లో కూడా ఉపయోగించాలని చూస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఇటీవలె శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే.. టీ20 సిరీస్‌లో అందర్ని ఇంప్రెస్ చేసిన అంశం ఏంటంటే.. బ్యాటర్లతో బౌలింగ్ చేయించడం. రియాన్ పరాగ్, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లు.. పార్ట్‌టైమ్ బౌలర్లుగా శ్రీలంకపై అదరగొట్టాడు. కొన్ని ఏళ్ల క్రితం టీమిండియాలో పార్ట్‌టైమ్ బౌలర్ల సంప్రదాయం ఎక్కువగా ఉండేది. కానీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీ హయాంలో అది పూర్తిగా తగ్గిపోయింది.
గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా టీమిండియాలో పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా ఎంతో కీలకంగా ఉండేవారు. రానురాను పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కనుమరుగయ్యారు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఇలా మూడు కేటగిరిల్లోనే ఆటగాళ్లను విభజించే వారు. కానీ, ఇప్పుడు టీమిండియాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత.. లెక్కలు మారాయి. జట్టులో బౌలింగ్ వేయడం వచ్చిన ప్రతి బౌలర్.. కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం.. మ్యాచ్‌లో అవసరమైన సమయంలో బౌలింగ్ వేయడం జరుగుతోంది. పాత ఫార్మూలాను మళ్లీ టీమిండియాలో ప్రవేవపెట్టి.. గంభీర్ సూపర్ సక్సెస్ అయ్యాడు.
టీ20 సిరీస్‌లో సక్సెస్ అయిన ఫార్ములాను వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లానే.. వన్డేల్లో ఓ పార్ట్‌టైమ్ బౌలర్‌ను రెడీ చేస్తున్నాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వన్డే టీమ్‌లో ఎంతో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అయ్యర్.. ఇప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా కూడా జట్టులో తన పాత్ర పరిధిని పెంచుకోనున్నాడు. శ్రీలంకతో శుక్రవారం జరగబోయే తొలి వన్డేకి ముందు శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరి గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో బ్యాటర్లు ఇలా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా జట్టుకు ఉపయోగపడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
T20I Series ✅
It’s now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG
— BCCI (@BCCI) August 1, 2024
Shreyas Iyer bowling in the nets. 😄 pic.twitter.com/IhusZC5JZ5
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 1, 2024