Dinesh Karthik: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం.. ఆ లీగ్​లో ఆడనున్న తొలి భారత ప్లేయర్​గా రికార్డు!

టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రొఫెషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్​కు కూడా అతడు వీడ్కోలు చెప్పేశాడు. అలాంటోడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రొఫెషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్​కు కూడా అతడు వీడ్కోలు చెప్పేశాడు. అలాంటోడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

దినేష్ కార్తీక్.. ఈ పేరు వినగానే అద్భుతమైన కీపింగ్, సూపర్బ్ బ్యాటింగ్ అందరికీ గుర్తుకొస్తుంది. ఈ టాలెంట్​తో ఏళ్ల పాటు అభిమానులను ఉర్రూతలూగించాడు డీకే. రెండు దశాబ్దాల పాటు అటు భారత జట్టుతో పాటు ఇటు దేశవాళీ క్రికెట్​లోనూ ఎన్నో సెన్సేషనల్ ఇన్నింగ్స్​లు ఆడి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. ఐపీఎల్​లోనూ ధనాధన్ బ్యాటింగ్​తో స్టార్ ప్లేయర్​గా వెలుగొందాడు. అయితే భారత జట్టుకు ఆడినా, డొమెస్టిక్ క్రికెట్​లో రాణించినా రాని పేరు.. ఆర్సీబీ తరఫున ఆడుతూ అతడు సంపాదించాడు. కీపర్​గా, బ్యాటర్​గా ఆ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. థండర్ ఇన్నింగ్స్​లతో బెంగళూరు ఫ్యాన్స్​కు ఆరాధ్య క్రికెటర్ అయిపోయాడు. అలాంటోడు ఐపీఎల్-2024తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

ఈ ఐపీఎల్​ సీజన్​తో ప్రొఫెషనల్ క్రికెట్​ నుంచి తప్పుకున్న 39 ఏళ్ల కార్తీక్.. కామెంట్రీతో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాడు. అయితే అతడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్​గా మారిన సౌతాఫ్రికా టీ20 లీగ్​లోకి అడుగుపెట్టనున్నాడు డీకే. ఎస్​ఏ 20లోని పర్ల్ రాయల్స్​ తరఫున ఆడేందుకు అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా అతడు హిస్టరీ క్రియేట్ చేశాడు. ఎస్​ఏ 20 లీగ్​లో ఆడనున్న తొలి భారత ఆటగాడిగా అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. దీనిపై డీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గ్రౌండ్​లోకి మళ్లీ అడుగుపెట్టనున్నానని.. ఈసారి సౌతాఫ్రికా గడ్డ మీద అలరించనున్నానని అతడు ట్వీట్ చేశాడు.

‘సౌతాఫ్రికాలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఎస్​ఏ 20లో ఆడే అవకాశం లభించినప్పుడు నేను నో చెప్పలేకపోయా. ఇంత అద్భుతమైన టోర్నమెంట్​ ద్వారా కమ్​బ్యాక్ ఇవ్వడం బాగుంది. కాంపిటీటివ్ క్రికెట్​లో మళ్లీ అడుగుపెట్టి పర్ల్ రాయల్స్ టీమ్​ తరఫున ఆడే క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూ బిజీగా మారిన డీకే.. ఆర్సీబీతో మరో ఒప్పందం చేసుకున్నాడు. తర్వాతి సీజన్​లో ఆ టీమ్​కు మెంటార్​గా, బ్యాటింగ్ కోచ్​గా ఉండేందుకు ఒప్పుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఇలా ఒకవైపు ఆర్సీబీకి మెంటార్​గా, మరోవైపు ఎస్​ఏ 20 లీగ్​లో ప్లేయర్​గా, ఇంకోవైపు కామెంటేటర్​గా ఫుల్ బిజీగా ఉన్న క్రికెటర్ దినేష్ కార్తీక్ ఒక్కడే కావొచ్చని క్రికెట్ లవర్స్ చెబుతున్నారు. మరి.. డీకే సౌతాఫ్రికా లీగ్​లో ఆడాలని నిర్ణయించుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments