వాళ్లనీ వీళ్లని అడ్రస్‌ అడుగుతూ వెళ్లిన ధోని! ఎవరింటికి వెళ్లాడో తెలిస్తే షాక్‌ అవుతారు!

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. అతను ఏం చేసినా సెన్సెషనే. ధోనికి ఉన్న క్రేజ్‌ అలాంటిది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న క్రికెటర్లలో ధోని ముందు వరుసలో ఉంటాడు. క్రికెట్‌ అభిమానుల్లో అత్యధికులు ధోని అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారు. కేవలం ధోని కోసమే ఐపీఎల్‌ చూసే వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఇలాంటి కల్ట్‌ క్రేజ్‌ ఒక్క ధోనికే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ధోని సాధించిన విజయాలు కారణం. టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు(2011 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. అలాగే అతని కెప్టెన్సీలో టీమిండియా స్వర్ణయుగంలో నడిచింది.

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత.. ఐపీఎల్‌ తప్ప మరే టోర్నీ ఆడని ధోని.. అభిమానులకు పెద్దగా కనిపించడు. కానీ, తాజాగా రోడ్డుపై ఆగి వాళ్లను వీళ్లను ఓ ఇంటి అడ్రస్‌ అడుగుతూ కనిపించాడు. ధోని లాంటి వ్యక్తి అడ్రస్‌ అడిగితే.. చెప్పని వ్యక్తి ఇండియాలో ఉంటాడా? ఉండడు కదా.. ఇక్కడ కూడా ధోని కారు ఆపి అడ్రస్‌ అడగ్గానే కొంతమంది ఎగబడి మరీ ధోనికి అడ్రస్‌ చెప్పారు. ఇంతకీ ధోని ఎవరింటి అడ్రస్‌ అడిగాడు? అనే ప్రశ్న ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. అయితే.. ధోని అడిగింది టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇంటి అడ్రస్‌ అని, అతన్ని కలిసేందుకు వెళ్లిన ధోని.. అడ్రస్‌ సరిగా తెలియకపోవడంతో అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియలేదు.

ఎందుకంటే ధోని యోగ్‌రాజ్‌ను కలిసినట్లు ఎలాంటి ఆధారం ఇంకా లభించలేదు. దీంతో అది ఫేక్‌ అయిఉంటుందని, వేరే అడ్రస్‌ అడిగితే.. యోగ్‌రాజ్‌ అడ్రస్‌ అడిగినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. అయితే.. కొన్ని రోజుల క్రితం ధోని కారణంగా తన కుమారుడు యువరాజ్‌ సింగ్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదని యోగ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేసి.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకుంటూ.. తాను ధోనికి పెద్ద అభిమానని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అంబటి రాయుడు యూటర్న్‌! పాలిటిక్స్‌ పక్కనపెట్టి మళ్లీ గ్రౌండ్‌లోకి..!

Show comments