MS Dhoni: మ్యాచ్ మధ్యలోనే ఆ ప్లేయర్​ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు.. ధోని గురించి అశ్విన్ కామెంట్స్!

Ravichandran Ashwin: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశాడు స్పిన్నర్ అశ్విన్. ఒక మ్యాచ్ మధ్యలోనే ఆ ప్లేయర్​ను మాహీ ఇంటికి వెళ్లిపొమ్మన్నాడని చెప్పాడు.

Ravichandran Ashwin: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశాడు స్పిన్నర్ అశ్విన్. ఒక మ్యాచ్ మధ్యలోనే ఆ ప్లేయర్​ను మాహీ ఇంటికి వెళ్లిపొమ్మన్నాడని చెప్పాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ కీపర్, బ్యాటర్​గా టీమ్​లోకి వచ్చిన మాహీ పించ్ హిట్టర్​గా పేరు తెచ్చుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్లను గడగడలాడించాడు. అతడి బ్యాటింగ్, కీపింగ్ సామర్థ్యంతో పాటు ఎలాంటి సిచ్యువేషన్​లో అయినా కూల్​గా ఉండే యాటిట్యూడ్​ను చూసి అతడికి టీమ్ మేనేజ్​మెంట్ కెప్టెన్​గా ప్రమోషన్ ఇచ్చింది. సారథిగా ధోని ఏమేం సాధించాడో అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్​తో పాటు వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్​కు అందించాడు. అలాగే టెస్టుల్లో జట్టును నంబర్ వన్ స్థానానికి చేర్చి క్రికెట్​లో బెస్ట్ కెప్టెన్స్​లో ఒకడిగా నిలిచాడు. ధోని కూల్​గా కనిపించినా కొన్ని సిచ్యువేషన్స్​లో అవసరమైతే తోటి ప్లేయర్లపై సీరియస్ కూడా అవుతుంటాడు.

మ్యాచ్​లో గెలుపు కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ తెలివైన క్రికెటింగ్ బుర్రగా పేరు తెచ్చుకున్నాడు ధోని. ఎవరైనా మాట వినకపోతే వాళ్లపై సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అతడి కెప్టెన్సీకి సంబంధించి కాంట్రవర్సీలు తక్కువే. అయితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం మాహీ సారథ్యంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. చెప్పిన మాట వినకపోయే సరికి ఓ ప్లేయర్​ను మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపొమ్మని ఎంఎస్​డీ ఆదేశించాడని అశ్విన్ తెలిపాడు. 2010లో పోర్ట్ ఎలిజబెత్​లో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని అన్నాడు. రిజర్వ్ ప్లేయర్లతో కలసి డగౌట్​లో కూర్చోవాలన్న సూచనను పేసర్ శ్రీశాంత్ పట్టించుకోకపోవడంతో ధోని అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నాడు అశ్విన్.

‘ఆ మ్యాచ్​లో రిజర్వ్​ ప్లేయర్లలో నేనూ ఒకడ్ని. ప్లేయింగ్ ఎలెవన్​లో లేకపోవడంతో ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందించా. కానీ రిజర్వ్ ప్లేయర్​గా ఉన్న శ్రీశాంత్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడు ఎక్కడ ఉన్నాడని మాహీ నన్ను అడిగాడు. డ్రెస్సింగ్​ రూమ్​లో ఉన్నాడని చెప్పడంతో కిందకు వచ్చి మిగిలిన రిజర్వ్ ఆటగాళ్లతో కూర్చోమని ధోని ఆదేశించాడు. అదే విషయాన్ని చెబితే శ్రీశాంత్ వినకుండా డ్రెస్సింగ్ రూమ్​లోనే ఉండిపోయాడు. ఇది తెలిసిన ధోని టీమ్ మేనేజర్ రంజిబ్ బిశ్వాల్​ దగ్గరకు వెళ్లి శ్రీశాంత్​కు ఇంట్రెస్ట్ లేదు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే, ఇండియా వెళ్లిపోతాడని చెప్పమన్నాడు. దీంతో ఈ విషయాన్ని శ్రీశాంత్​కు చెప్పా. దీంతో అతడు టీమ్ డ్రెస్ వేసుకొని డగౌట్​కు వచ్చాడు’ అని అశ్విన్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు.

Show comments