కోహ్లీని అలా పోల్చడం కరెక్ట్ కాదు.. విండీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 10:06 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 10:06 PM, Wed - 26 July 23
కోహ్లీని అలా పోల్చడం కరెక్ట్ కాదు.. విండీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. వారి వారి టైమ్ పీరియడ్ లో క్రికెట్ ను శాసించారు. కానీ టీమిండియా క్రికెట్ గాడ్, దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం వరల్డ్ క్రికెట్ పై చెరగని ముద్రను వేశాడు. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర క్రికెటర్లను సచిన్ తో పోలుస్తూ.. మాజీలు, ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సెంచరీతో 76 అంతర్జాతీయ శతకాలు పూర్తి చేసుకున్నాడు విరాట్. ఈ క్రమంలోనే సచిన్ కంటే వేగంగా 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు విరాట్. దీంతో మరోసారి సచిన్ టెండుల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ చర్చ మెుదలైంది.

టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో శతకం బాది ఫామ్ లోకి వచ్చాడు. ఈ శతకంతో అంతర్జాతీయంగా 76 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వన్డేల్లో మరో మూడు సెంచరీలు కొడితే.. క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేస్తాడు విరాట్. ఇక నాలుగు సెంచరీలు చేస్తే.. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన తొలి బ్యాటర్ గా విరాట్ సరికొత్త చరిత్రను లిఖిస్తాడు. కాగా.. ఇప్పటికే విరాట్ 50వ సెంచరీ కోసం ప్రోమోను కూడా సిద్దం చేసి పెట్టుకంది స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్. దాంతో విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. విరాట్ ను ‘గాడ్ ఆఫ్ వైట్ బాల్ క్రికెట్’గా పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సచిన్ కు విరాట్ కు అసలు పోలికేంటి? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం కర్ట్ లీ ఆంబ్రోస్. విరాట్ ను సచిన్ తో పోల్చడం కరెక్ట్ కాదు. వైట్ బాల్ క్రికెట్ గాడ్ గా కూడా పోల్చడం సరికాదని ఆంబ్రోస్ పేర్కొన్నాడు. వీరిద్దరూ విభిన్న తరాలకు చెందినవాళ్లు. సచిన్ లెజండరీ ప్లేయర్. వరల్డ్ క్రికెట్ లో అతను అన్నీ సాధించాడని చెప్పుకొచ్చాడు విండీస్ దిగ్గజం. ఇక క్రికెట్ పై సచిన్ కు అపారమైన నాలెడ్జ్ ఉందని, అతడు ఆడే విధానం చూస్తేనే అది అర్ధమవుతుందని తెలిపాడు. క్రికెట్ వల్ల చాలామందికి గుర్తింపు వచ్చింది. కానీ సచిన్ వల్లే క్రికెట్ కు గుర్తింపు వచ్చిందని విండీస్ దిగ్గజం ఆంబ్రోస్ పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తిని ఏ క్రికెటర్ తో కూడా పోల్చకూడదన్నాడు ఈ విండీస్ లెజెండ్.

అయితే విరాట్ కోహ్లీ గోప్ప క్రికెటరే.. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు ఆంబ్రోస్. కానీ మూడేళ్ల పాటు విరాట్ సెంచరీ చేయకపోతే.. అతడి పనైపోయిందని చాలా మంది అన్నారు. ఇలాంటి టైమ్ ను దాటినప్పుడే అతడు గోప్ప ప్లేయర్ గా మారుతాడని వివరించాడు. ఇక విరాట్ క్వాలిటీ ప్లేయర్ అని, అతడు భారత్ కు ఇంకా ఎంతో ఇవ్వాల్సి ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఆంబ్రోస్. ఇలాంటి ఇద్దరు ప్లేయర్ల మధ్య పోలికేంటి? అంటూ ప్రశ్నించాడు. మరి సచిన్-విరాట్ ల మధ్య పోలికపై వెస్టిండీస్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీ20ల్లో సంచలనం సృష్టించిన పసికూన బౌలర్.. దీపక్ చాహర్ ఆల్​టైమ్ రికార్డు బ్రేక్!

Show comments