రాసిపెట్టుకోండి.. RCB ప్లే ఆఫ్స్‌కు చేరడం పక్కా! CSK ఇంటికేనా..?

CSK vs RCB, IPL 2024, Moeen Ali: ఆర్సీబీతో ఈ నెల 18న సీఎస్‌కే కీలక మ్యాచ్‌ ఆడనుంది. అయితే.. ఓ ఆటగాడి వల్ల ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

CSK vs RCB, IPL 2024, Moeen Ali: ఆర్సీబీతో ఈ నెల 18న సీఎస్‌కే కీలక మ్యాచ్‌ ఆడనుంది. అయితే.. ఓ ఆటగాడి వల్ల ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సీజన్‌ ఆరంభంలో చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఇప్పుడు అన్ని జట్లను భయపెట్టేలా డేంజర్‌ గేమ్‌ ఆడుతోంది. తొలి 8 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ టోర్నీ నుంచి దూరం అయ్యేందుకు రెడీ అయింది. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ నెల 18న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ మంచి మార్జిన్‌తో విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ, లక్నో ఒక మ్యాచ్‌ ఓడిపోతే.. ఆర్సీబీకి ఇంకా బెటర్‌ ఛాన్స్‌ ఉంటుంది.

లక్నో ఫలితం పక్కనపెడితే.. శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌ ఒక నాకౌట్‌ మ్యాచ్‌ల మారనుంది. ఎందుకంటే.. ఈ టీమ్‌ విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. ఇంత కీలక మ్యాచ్‌కు ముందు.. సీఎస్‌కేకు షాక్‌ తగిలింది. అలాగే ఆర్సీబీ కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటంటే.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నేషనల్‌ డ్యూటీ కోసం స్వదేశానికి వెళ్లిపోవడంతో.. సీఎస్‌కేకి మొయిన్‌ అలీ, ఆర్సీబీకి విల్‌ జాక్స్‌ దూరం అయ్యారు. వీరిద్దరూ ఆయా టీమ్స్‌లో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే.. ఇంగ్లండ్‌ ప్లేయర్లు వెళ్లిపోవడం ఆర్సీబీ కంటే సీఎస్‌కేకే ఎక్కువ నష్టం అని చెప్పాలి.

విల్‌ జాక్స్‌ లేకపోతే.. అతని స్థానంలో ఆడేందుకు మ్యాచ్‌ విన్నర్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. ప్రస్తుతం మ్యాక్సీ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా.. నాటౌట్‌ మ్యాచ్‌ల్లో అతను ఎంత అద్భుతంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, సీఎస్‌కేకు మొయిన్‌ అలీ ప్లేస్‌లో ఆడేందుకు సరైన ప్లేయర్‌ లేడు. ఈ సమస్య సీఎస్‌కేను ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పటికే ముస్తఫీజుర్‌ రెహమాన్‌, పతిరాణా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న సీఎస్‌కే.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ ముందు నిలబడటం కష్టమే అని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments