Vinay Kola
Chandika Hathurusinghe: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చండిక హతురుసింఘేని హెడ్ కోచ్ గా సస్పెండ్ చేసింది. అతని స్థానంలో ఫిల్ సీమన్స్ ని తాజాగా నియమించింది.
Chandika Hathurusinghe: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చండిక హతురుసింఘేని హెడ్ కోచ్ గా సస్పెండ్ చేసింది. అతని స్థానంలో ఫిల్ సీమన్స్ ని తాజాగా నియమించింది.
Vinay Kola
బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండిక హతురుసింఘేకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. అతన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సస్పెండ్ చేసింది. ముందు ఒక 48 గంటలు సస్పెండ్ చేసింది. ఆ తరువాత పూర్తిగా సస్పెండ్ చేసినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. అతను క్రమ శిక్షణ తప్పిన కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దాంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు షోకాజ్ నోటీసులను కూడా అందించింది. ఇక చండిక హతురుసింఘే హెడ్ కోచ్ నుంచి తొలగి పోయాక అతని స్థానంలోకి ఫిల్ సీమన్స్ వచ్చారు. ఫిల్ సీమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు టెంపరరీగా హెడ్ కోచ్ బాధ్యతలని చేపట్టనున్నారు. అయితే చండిక హతురు సింఘే సస్పెండ్ అవ్వడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ బయటపెట్టారు. ఒకటి అతను ప్లేయర్ ని కొట్టడం, ఇంకోకటి అతను తన కాంట్రాక్ట్ లో ఉన్న ప్రకారం కాకుండా ఎక్కువ సెలవులు తీసుకోవడం… ఈ రెండు కారణాల వలన అతను హెడ్ కోచ్ పదవిని కోల్పోయాడు.
హతురుసింఘే గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ కోచ్‌గా రెండోసారి తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బోర్డు ప్రెసిడెంట్ గా ఫారూక్ అహ్మద్ పగ్గాలు తీసుకున్నాడు. దాంతో హతురుసింఘేకి ఊహించని షాక్ తగిలింది. ఫారూక్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న వెంటనే బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా అతను ఇకపై కొనసాగడని చెప్పాడు. హతురుసింఘే నేతృత్వంలో బంగ్లాదేశ్ గత ఏడాది వన్డే ప్రపంచకప్, ఈ ఏడాది T20 ప్రపంచకప్ ఆడింది. కానీ అతని కోచింగ్ లో బంగ్లా ప్లేయర్స్ పేలవ ప్రదర్శన చేశారు. అయితే ఈ ఏడాది పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ 2-0తో టెస్టు సిరీస్ లో విజయం సాధించడం మాత్రం ఆ టీంకి అత్యుత్తమ విజయంగా చెప్పవచ్చు. ఈ ఏడాది ఈ ఒక్క విజయమే హెడ్ కోచ్ గా హతురు సింఘేకి చెప్పుకోదగ్గ విజయం అయింది.
పాకిస్థాన్‌లో బంగ్లా టీంకి ఇది తొలి విజయం కావడం విశేషం. ఏకంగా 15 ఏళ్ల తర్వాత ఇదే వారి తొలి విదేశీ టెస్టు సిరీస్ గెలుపు. అయితే, ఆ తర్వాత జరిగిన భారత పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20 లు ఆడింది బంగ్లాదేశ్. కానీ బంగ్లా టీం ప్లేయర్స్ టెస్ట్‌లలో 2-0 తేడాతో ఓడిపోయారు. ఇక T20I లలో అయితే 3-0 తేడాతో దారుణంగా ఓడిపోయారు. ముఖ్యంగా ఇందులో మూడవ మ్యాచ్‌లో అయితే అత్యంత చెత్త ఓటమిని చవి చూశారు. మరి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హతురుసింఘేని హెడ్ కోచ్ గా సస్పెండ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.