బౌలర్‌గా రింకూ సక్సెస్‌కి గంభీర్‌ కారణం కాదు! అసలు గురువు ఎవరంటే..?

Brendon Mccullum, Rinku Singh, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టిన రింకూ సింగ్‌ విషయంలో గంభీర్‌ చేసిందేం లేదు, అతని సక్సెస్‌ వెనుక అసలైన హీరో ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

Brendon Mccullum, Rinku Singh, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టిన రింకూ సింగ్‌ విషయంలో గంభీర్‌ చేసిందేం లేదు, అతని సక్సెస్‌ వెనుక అసలైన హీరో ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

అంతా అనుకున్నట్లే జరిగింది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. కానీ, మూడో టీ20లో క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత క్రికెట్‌ మజా అందించి మరీ.. సూర్య సేన సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోర్‌ చేసి.. ఆ తర్వాత శ్రీలంక ఛేజింగ్‌లో ఆల్‌మోస్ట్‌ మ్యాచ్‌ను గెలిచేసిన తర్వాత.. టీమిండియా అమ్ములపొదిలో దాచిన కొత్త అస్త్రాలను బయటికి తీసి.. లంకకు ఊహించని షాకిచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడూ బౌలింగ్‌ చేయని రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌తో బౌలింగ్‌ చేయించి.. టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. 137 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటూ.. సూపర్‌ ఓవర్‌తో మ్యాచ్‌ గెలిచింది.

అయితే.. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌తో మెప్పించాడు. ఎంతో కీలకమైన 19వ ఓవర్‌ వేసి.. తీవ్ర ఒత్తిడిలో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో సంచలన ప్రదర్శన కనబర్చాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న లంక.. 12 బంతుల్లో 9 పరుగులు చేయకుండా అడ్డుపడ్డాడు. 19వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. రింకూ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే సూర్య కూడా చివరి ఓవర్‌ బాగా వేశాడు.

రింకూ సింగ్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా రాణించడానికి కారణం కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అని చాలా మంది భావిస్తున్నారు. కానీ, గంభీర్‌ కంటే ముందు రింకూలోని బౌలర్‌ను గుర్తించింది మాత్రం.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌. అతను ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన సమయంలో రింకూ సింగ్‌తో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు. అందుకే సంబంధించిన వీడియోను తాజాగా కేకేఆర్‌ తమ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. రింకూ బౌలింగ్‌ క్రెడిట్‌ మొత్తం గంభీర్‌కే కాదని, మెక్‌కల్లమ్‌కు కూడా దక్కుతుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments