IPL మెగా ఆక్షన్ లో.. 4 టీమ్స్ కెప్టెన్లు మార్పు! ఢిల్లీ కెప్టెన్ గా రోహిత్?

Big Things To Happen In IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే అభిమానులకు బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎందుకంటే ఏకంగా 4 జట్లు తమ కెప్టెన్స్ ని మార్చేస్తాయి అంటున్నారు. రోహిత్ శర్మ ఢిల్లీ కెప్టెన్ గా వాస్తాడు అంటున్నారు.

Big Things To Happen In IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే అభిమానులకు బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎందుకంటే ఏకంగా 4 జట్లు తమ కెప్టెన్స్ ని మార్చేస్తాయి అంటున్నారు. రోహిత్ శర్మ ఢిల్లీ కెప్టెన్ గా వాస్తాడు అంటున్నారు.

క్రికెట్ ఫ్యాన్స్ ప్రస్తుతం పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ సంబరాల్లో నుంచి టీమిండియా శ్రీలంక టూర్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. శ్రీలంకతో భారత్ 3 టీ20లు, 3 వన్డే మ్యాచుల్లో తలపడనుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ టూర్ మీదే ఉంది. అయితే టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పెను సంచలనాలు చూసే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగానే మెగా ఆక్షన్ మీద చాలా మందికి భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి మించి పలు జట్లలో పెను మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లీకులు చూస్తుంటే ఏదో గట్టిగానే జరిగేటట్టు ఉంది.

4 టీమ్స్ కెప్టెన్స్ లో మార్పు?:

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న వార్తలు చూస్తుంటే.. మెగా ఆక్షన్ లో ఏకంగా నాలుగు టీమ్స్ తమ కెప్టెన్స్ ని మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏ టీమ్స్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ముంబయి ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రం గుజరాత్ టైటాన్స్ గానీ, ఢిల్లీ క్యాపిటల్స్ లోకి గానీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ఏ టీమ్ లోకి వెళ్లినా.. కచ్చితంగా ఆ టీమ్ కు కెప్టెన్ గానే వ్యవహరిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంక రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ని వదిలి.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కెప్టెన్ కోసం ఢిల్లీ రోహిత్ ని ఎలాగైనా పొందాలి అని చూస్తుంది.

గౌతమ్ అదాని చేతికి గుజరాత్?:

సీవీసీ క్యాపిటల్స్ 2021లో గుజరాత్ టైటాన్స్ జట్టును రూ.5,625 కోట్లతో సొంతం చేసుకుంది. ఆ జట్టు విలువ 1 బిలియన్ డాలర్స్ నుంచి 1.5 బిలియన్ డాలర్స్ మధ్య ఉంటుంది. అయితే బీసీసీఐ పెట్టిన షరతుల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఏ జట్టు అయినా తమ షేర్స్ ని అమ్మేందుకు వీలులేదు. ఆ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ తమ టీమ్ కి సంబంధించి మేజర్ స్టేక్ ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారంట. అందుకు సంబంధించి అదానీ గ్రూప్స్, టొరెంట్ గ్రూప్స్ ని సంప్రదిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. సీసీవీ క్యాపిటల్స్ మేజర్ షేర్ ని విక్రయించి.. నామమాత్రపు షేర్ ని మాత్రమే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదానీ కూడా గుజరాత్ జట్టును తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. జీటీ అడుగుపెట్టిన తొలి సీజన్లో విన్నర్ గా, రెండో సీజన్లో రన్నర్ గా నిలిచింది.

లక్నోని వీడనున్న రాహుల్?:

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సారథి కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్ లో జట్టు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని బలంగా చెబుతున్నారు. గత సీజన్లో మైదానంలోనే కెప్టెన్ రాహుల్ ని కించ పరుస్తూ సంజీవ్ గోయెంక మైదానంలోనే వాదించడం పెద్ద దుమారం లేపింది. ఆ తర్వాత వచ్చిన వార్తలను కవర్ చేయడానికి.. రాహుల్ తన ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారు. అయినా కూడా రాహుల్ మాత్రం ఆ బాధ నుంచి బయట పడలేదు అంటున్నారు. కచ్చితంగా మెగా ఆక్షన్ లో లకన్నో సూపర్ జెయింట్స్ ని వదిలివెళ్తాడు అంటున్నారు. అలాగే ముంబయి ఇండియన్స్ నుంచి జాస్ప్రిత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చేస్తారు అని బలంగానే చెప్తున్నారు. అంటే రోహిత్ శర్మ ని కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చినప్పుడే బుమ్రా, స్కై అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇప్పుడు వీళ్లు జట్టు నుంచి బయటకు వచ్చినా కూడా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి.. మెగా ఆక్షన్ కి సంబంధించి వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments