చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ధోని వరల్డ్ రికార్డ్ బద్దలు!

  • Author Soma Sekhar Published - 11:58 AM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 11:58 AM, Mon - 10 July 23
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ధోని వరల్డ్ రికార్డ్ బద్దలు!

ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్ లు గెలిచి మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియాకు మూడో టెస్ట్ లో షాకిచ్చింది ఇంగ్లాండ్. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది ఇంగ్లాండ్. దాంతో యాషెస్ సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని నెలకొల్పిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్. మరి ధోని నెలకొల్పిన ఆ వరల్డ్ రికార్డు ఏంటో? స్టోక్స్ దాన్ని ఎలా బ్రేక్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

బెన్ స్టోక్స్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఆల్ రౌండర్ గా, సారథిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో అటు బ్యాట్ తో.. ఇటు బాల్ తో రాణిస్తున్నాడు స్టోక్స్. ఇటీవలే ఓ అరుదైన రికార్డు నెలకొల్పి దిగ్గజాల సరసన నిలిచిన స్టోక్స్.. తాజాగా మరో రికార్డును బ్రేక్ చేశాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా.. జరుగుతున్న మూడో టెస్ట్ లో విజయం ద్వారా ఈ ఘనతను సాధించాడు స్టోక్స్. వివరాల్లోకి వెళితే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 250 ప్లస్ టార్గెట్ ను అత్యధిక సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు సారథిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటివరకు స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీమ్ ఐదు సార్లు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక ఈ రికార్డు గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. ధోని సారథ్యంలో టీమిండియా నాలుగు సార్లు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్ తాజాగా ఈ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ రికార్డు జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా ఉన్నారు. ఈ ద్వయం కెప్టెన్సీలో మూడు సార్లు తమ జట్లు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఇంగ్లాండ్. ఆసీస్ తొలి ఇన్సింగ్స్ లో 263 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులు చేసింది. మార్క్ వుడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Show comments