Virat Kohli, Rohit Sharma: కోహ్లీ, రోహిత్‌ శర్మల కోసం ఆ ఒక్క పని చేయండి! BCCIకి రైనా రిక్వెస్ట్‌

BCCI, Virat Kohli, Rohit Sharma, Suresh Raina: టీమిండియాలో ప్రస్తుతం ఉన్న దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కోసం బీసీసీఐ ఆ ఒక్క పని చేయాలంటూ మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా కోరాడు. మరి అతను ఏం కోరాడో ఇప్పుడు తెలుసుకుందాం..

BCCI, Virat Kohli, Rohit Sharma, Suresh Raina: టీమిండియాలో ప్రస్తుతం ఉన్న దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కోసం బీసీసీఐ ఆ ఒక్క పని చేయాలంటూ మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా కోరాడు. మరి అతను ఏం కోరాడో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడంతో యావత్‌ దేశం ఫుల్‌ ఖుషీ అయింది. 15 ఏళ్లుగా కలిసి భారతదేశం తరఫున క్రికెట్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తొలిసారి తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. ఇద్దరూ వేర్వేరుగా వరల్డ్‌ కప్‌లను ముద్దాడినా.. కలిసి తొలిసారి ఒక వరల్డ్‌ కప్‌ సాధించారు. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లో రోహిత్‌ సభ్యుడిగా ఉన్నాడు, అలాగే 2011లో టీమిండియా సాధించిన వన్డే వరల్డ్‌ కప్‌లో విరాట్‌ కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. ఇద్దరు కలిసి 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించినా.. వన్డే, టీ20 వరల్డ్‌ కప్స్‌ కోసం మాత్రం గత 13 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ కలను ఈ టీ20 వరల్డ్‌ కప్‌తో నిజం చేసుకున్నారు.

అయితే.. టీమిండియా కోసం ఇంత చేసిన ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్ల కోసం బీసీసీఐ ఒక పని చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా కోరాడు. దేశానికి క్రికెట్‌లో వాళ్లిద్దరు అందించిన సేవలకు గుర్తింపుగా వారిద్దరి జెర్సీ నంబర్లను రిటైర్‌ చేయాలని కోరాడు. విరాట్‌ కోహ్లీ ధరించే 18, రోహిత్‌ శర్మ ధరించే 45 నంబర్లను వారికి గౌరవార్థంగా రిటైర్‌ చేస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని రైనా రిక్వెస్ట్‌ చేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

వీరిద్దరితో పాటు రవీంద్ర జడేజా సైతం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే.. రైనా మాత్రం కోహ్లీ, రోహిత్‌ శర్మ జెర్సీ నంబర్లను రిటైర్‌ చేయాలని కోరాడు. అంటే ఆ రెండు నంబర్లను భవిష్యత్తులో మరో క్రికెటర్‌కు కూడా ఎలాట్‌ చేయారు. ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్‌ నంబర్‌ 10 జెర్సీని, ధోని నంబర్‌ 7 జెర్సీని రిటైర్‌ చేశారు. అలాగే ఇప్పుడు కోహ్లీ, రోహిత్‌ జెర్సీలను రిటైర్‌ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. టీ20ల నుంచి తప్పుకున్నా.. వన్డే, టెస్టుల్లో కోహ్లీ, రోహిత్‌ ఆడనున్నారు. దాంట్లో కూడా రిటైర్‌ అయిన తర్వాత.. ఆ జెర్సీ నంబర్ల రిటైర్‌ అంశంపై బీసీసీఐ ఆలోచించే అవకాశం ఉంది. మరి రైనా బీసీసీఐకి చేసిన రిక్వెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments