వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ఓ పని భారతీయుల మనసు గెలుచుకుంది.
వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ఓ పని భారతీయుల మనసు గెలుచుకుంది.
వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో కంగారూల జట్టు విజయం సాధించింది. అయితే భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ఓ పని భారతీయుల మనసు గెలుచుకుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు గూస్ బమ్స్ రావడం పక్కా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్ లోనే ఆటగాళ్లు గొడవకు దిగటం, సెల్పీల కోసం ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకురావడం, క్రికెటర్లకు లవ్ ప్రపోజల్స్, ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం ఇదివరకే చూసి ఉన్నాం. కానీ తాజాగా పాక్-ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీటన్నింటికీ మించి ఓ దృశ్యం వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే.. కచ్చితంగా మీకు గూస్ బమ్స్ రావడం పక్కా. ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి ఇండియన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇంతకీ మ్యాచ్ లో ఏం జరిగిందంటే? పాక్-ఆసీస్ మ్యాచ్ జరుగుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించాడు. దీంతో స్టేడియం మెుత్తం అతడికి మద్దతుగా నిలిచి ‘భారత్ మాతాకీ జై.. భారత్ మాతాకీ జై’ అంటూ దద్దరిల్లింది. ఈ నినాదాలతో చిన్నస్వామి స్టేడియం మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆసీస్ ఫ్యాన్స్ అయి ఉండి.. భారతదేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం అభినందించదగ్గ విషయం అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఓపెనర్లు వార్నర్(163), మిచెల్ మార్ష్(121)సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 62 రన్స్ తేడాతో ఓడిపోయింది.
Australia fans saying “Bharat Mata Ki Jai” at Chinnaswamy Stadium.pic.twitter.com/udVosrzhbv
— Johns. (@CricCrazyJohns) October 21, 2023