అబుదాబీ టీ10 లీగ్ లో ఓ విచిత్రమైన నో బాల్ నమోదు అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అబుదాబీ టీ10 లీగ్ లో ఓ విచిత్రమైన నో బాల్ నమోదు అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో కొన్ని కొన్ని ఆసక్తికర, నవ్వుతెప్పించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ ల్లో లవ్ ప్రపోజల్స్, వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక క్రికెటర్లు చేసే కొన్ని పనులు కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అబుదాబీ టీ10 లీగ్ లో ఓ విచిత్రమైన సంఘటన నమోదు అయ్యింది. ఈ లీగ్ లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్-నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన నో బాల్ నమోదు అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అబుదాబీ టీ10 లీగ్ లో క్రికెట్ లో ఇప్పటి వరకు చూడని నో బాల్ నమోదైంది. ఈ లీగ్ లో భాగంగా చెన్నై బ్రేవ్స్ వర్సెస్ నార్తర్న్ వారియర్స్ టీమ్స్ తలపడ్డాయి. చెన్నై బ్రేవ్స్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 5వ ఓవర్ వేయడానికి వచ్చాడు నార్తర్న్ వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్. ఈ ఓవర్ లో మూడో బంతిని అతడు నో బాల్ వేయడంతో అంపైర్ సాధారణంగానే నో బాల్ గా ప్రకటించాడు. కానీ రిప్లేలో చూడగా.. అందరూ ఒక్కసారిగా ముక్కుమీద వేలేసుకున్నారు. ఎందుకంటే అతడు వేసింది మామూలు నో బాల్ కాదు.. నో బాల్స్ యందు ఈ నోబాల్ వేరయా! అనే రేంజ్ లో వేశాడు అభిమన్యు మిథున్. అతడి ఫుట్ కు క్రీజ్ కు మధ్య దూరం దూరం అందరిని ఆశ్చర్యపరిచింది. క్రీజ్ నుంచి చాలా దూరంగా అభిమన్యూ మిథున్ తన కాలిని వేశాడు.
ప్రస్తుతం ఈ నో బాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు క్రికెట్ హిస్టరీలో ఇది అత్యంత చెత్త నో బాల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నో బాల్ ఇప్పటి వరకు చూడలేదని రాసుకొస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 9.7 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరి ఈ భారీ నో బాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What’s happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10
pic.twitter.com/FGcbshIhPz— Farid Khan (@_FaridKhan) December 2, 2023