Tirupathi Rao
Rewind Telugu Movie 2024 Review And Rating: సాధారణంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తారు కూడా. మరి.. ఈ టైమ్ ట్రావెల్ లవ్ ఎంటర్టైనర్ ని తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.
Rewind Telugu Movie 2024 Review And Rating: సాధారణంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తారు కూడా. మరి.. ఈ టైమ్ ట్రావెల్ లవ్ ఎంటర్టైనర్ ని తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.
Tirupathi Rao
టాలీవుడ్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు కచ్చితంగా ఆదరణ ఉంటుంది. అందులోనూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే మామూలు విషయమా? తెలుగు ప్రేక్షకులకు టైమ్ ట్రావెల్ అనగానే ఆదిత్య 369 సినిమానే గుర్తొస్తుంది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చాయి. కానీ, ఇలాంటి జానర్ టచ్ చేయడానికి ఎక్కువ మంది ధైర్యం చేయరు. కానీ, కల్యాణ్ చక్రవర్తి ఆ ధైర్యం చేశారు. రివైండ్ అనే ఒక టైమ్ ట్రావెల్ ఎంటర్ టైనర్ ను తీసుకొచ్చారు. ఈ మూవీకి కల్యాణ్ చక్రవర్తి డైరెక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మరి.. ఒక డేరింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ లవ్ ఎంటర్ టైనర్ రివైండ్ చిత్రం ఎలా ఉంది? ఈ మూవీ కథ ఏంటి? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ రివ్యూ చూసేయండి..
కార్తిక్(సాయి రోనక్) ఒక సాఫ్ట్ వేర్ డెవలప్పర్. ఛాలెంజెస్ అంటే అతనికి ఇష్టం. సరదాగా సాగిపోతున్న కార్తిక్ లైఫ్ లోకి ఒకరోజు అనుకోకుండా శాంతి(అమృత) వస్తుంది. ఆమెను చూడగానే కార్తిక్ ప్రేమలో పడిపోతాడు. అయితే లక్కీగా ఆమె కార్తిక్ పనిచేస్తున్న ఆఫీస్ లోనే జాయిన్ అవుతుంది. ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరుగుతుంది. మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ సమయంలోనే కార్తిక్ కు శాంతి తన తాత కృష్ణమూర్తి(సామ్రాట్) గురించి చెబుతుంది. ఈ కథలో కృష్ణమూర్తిది కీలకపాత్ర. ఎందుకంటే ఆ కృష్ణమూర్తే టైమ్ మిషన్ ని కనిపెట్టింది. తర్వాత కార్తిక్ శాంతితో తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు శాంతి.. కార్తిక్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రపోజ్ చేస్తుందనని అనుకుంటే.. కార్తిక్ కి ఒక స్పెషల్ వ్యక్తికి పరిచయం చేస్తానని చెప్తుంది. తాను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాను అని షాకిస్తుంది. శాంతి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న కార్తిక్ మనసు విరిగిపోతుంది. చిన్నప్పుడే తల్లిని.. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన కార్తిక్.. ఇంక తన లైఫ్ లో ప్రేమ అనేది ఉండదు అని ఫిక్స్ అయిపోతాడు. అనుకోకుండా కార్తిక్ కి టైమ్ మిషన్ దొరుకుతుంది. అక్కడి నుంచి అతను టైమ్ ట్రావెల్ చేస్తాడు. అసలు కార్తిక్ కి ఆ మిషన్ ఎలా దొరుకుతుంది? అతను కాలంలో వెనక్కి వెళ్లాడా? ముందుకు వెళ్లాడా? అసలు టైమ్ ట్రావెల్ చేయాలి అని ఎందుకు అనుకుంటాడు? శాంతి లవ్ చేసింది ఎవరిని? కార్తిక్ కి శాంతి ప్రేమ దొరుకుతుందా లేదా? ఇలాంటి చాలానే ప్రశ్నలకు సమాధానమే రివైండ్ మూవీ కథ.
సాధారణంగా కథలో ఎక్స్ పెరిమెంట్ చేయడానికి చాలామంది డైరెక్టర్స్ సాహసం చేయరు. ఎందుకంటే సక్సెస్ అయితే ఓకే. మరి.. బ్యాక్ ఫైర్ అయితే ఏంటి? ఆ ప్రశ్న దగ్గరే చాలామంది ఆగిపోతారు. కానీ, డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా కల్యాణ్ చక్రవర్తి మాత్రం ఆ స్టెప్ తీసుకున్నారు. రివైండ్ సినిమాలో చాలానే ప్రయోగాలు చేశారు. నిజానికి మూవీ కాన్సెప్ట్ ఏంటి అనేది ట్రైలర్ చూడగానే అందరికీ అర్థమైపోతుంది. ఈ మూవీలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది అని ఓపెన్ గానే చెప్పేశారు. ఆ పాయింట్ చుట్టూ ఒక చక్కని ప్రేమకథను అల్లారు. నిజానికి ఈ మూవీలో టైమ్ ట్రావెల్ అనేది ఒక భాగం మాత్రమే. మిగిలిన కథ మొత్తం కార్తిక్- శాంతి ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రేమకథలో టైమ్ ట్రావెల్ ఎలా భాగం అయ్యింది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
సైంటిస్ట్ కృష్ణమూర్తి ఎంట్రీతో ఈ సినిమాని ఓపెన్ చేశారు. ఆయనే ఈ టైమ్ మిషన్ ని కనిపెట్టారు. టైమ్ మిషన్ కనిపెట్టిన కృష్ణమూర్తి గతం నుంచి భవిష్యత్తు(2019)కు వస్తాడు. మళ్లీ ఎక్కడికో మాయం అయిపోతాడు. అలా వచ్చిపోయి కథలో చాలానే ట్విస్టులకు కారణం అవుతారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం శాంతి- కార్తిక్ మధ్య పరిచయం, స్నేహం, బ్యాక్ ఎండ్ లో కృష్ణమూర్తి, టైమ్ మిషన్ గురించి ఎలివేషన్స్ ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలో కథలో చాలానే డాట్స్ వదిలేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం డీసెంట్ గానే అనిపిస్తుంది. కాకపోతే టైమ్ మెషిన్ వాడిన కృష్ణమూర్తి ఏమయ్యాడు? ఆ టైమ్ మిషన్ ఏమైంది? అనే ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ లో లూప్ లో తిరుగుతూ ఉంటాయి. అందుకే ఈ పాయింట్ దగ్గర సినిమా కాస్త ల్యాగ్ అయ్యింది అనే భావన కలుగుతుంది. నిజానికి ఇందులో డైరెక్టర్ ని నిందించలేం. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ ప్రేమకథ. దానిని ఎస్టాబ్లిష్ చేయడానికే ఆయన సమయం తీసుకున్నాడు. కాకపోతే ఆడియన్స్ ఆసక్తి టైమ్ మిషన్ మీద ఉండటంతో ఆ భావన కలుగుతుంది.
నిజానికి ఈ మూవీలో సెకండ్ పార్ట్ లో కొత్త కథ ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ లో వదిలేసిన డాట్స్ మొత్తాన్ని ట్విస్టులు రివీల్ చేస్తూ కలుపుతూ వెళ్లారు. నిజానికి ఫస్ట్ ఆఫ్ జరిగిన కథను రివైండ్ చేసి మళ్లీ ప్లే చేస్తారు. అక్కడ ఏదైతే ప్రశ్నలు వదిలేశారో.. ఆ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఇస్తూ వెళ్లారు. ఇక్కడే అసలు సిసలు ట్విస్టులు అన్నీ రివీల్ అవుతూ వెళ్తాయి. అలాగే మూవీలో తండ్రీకొడుకు ఎమోషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కార్తిక్ కి తన తండ్రి(సీనియర్ నటుడు సురేశ్) మీద ఉన్న ప్రేమను.. ఆయనతో గడిపిన ఆనంద క్షణాలను మన ముందుకు తీసుకొస్తారు. ఇక్కడ ఆడియన్ ని కాస్త ఎమోషనల్ చేసేశారు. సెకండాఫ్ లో ఆడియన్ ప్రశ్నలకు సమాధానాలను ఫాస్ట్ ఫార్వార్డ్ లో చెబుతూ వెళ్తారు. ఒక్కో ట్విస్టు రివీల్ అవుతూ ఉంటే ఆడియన్ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా.. ఇక్కడ కూడా ఇంకా కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు.. మరోసారి థియేటర్ కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే.. రివైండ్ మూవీ పార్ట్ 2 కోసం అనమాట. అవును ఈ మూవీకి పార్ట్ కూడా ఉంది. ఓవరాల్ గా సినిమాలో ఆడియన్ ని ఒక మంచి ఎగ్జైట్మెంట్ తో అయితే థియేటర్ నుంచి పంపారు. ట్విస్టులు, టర్నులతో ఒక మంచి లవ్ ఎంటర్ టైనర్ చూపించారు.
ఈ మూవీకి హీరో- హీరోయిన్లు బిగ్ అసెట్ అనే చెప్పాలి. సాయి రోనక్.. కార్తిక్ పాత్రలో జీవించేశాడు. లవ్- బాధ- యాక్షన్- కామెడీ.. ఇలా అన్ని ఎమోషన్స్ ని చక్కగా పలికించాడు. ఈ కథ మొత్తాన్ని తన భుజాల మీద ముందుకు తీసుకెళ్లాడు. ఇంక అమృతని చూస్తే డెబ్యూ హీరోయిన్ అని ఎవరూ అనుకోరు. తన పాత్రకు హండ్రెండ్ పర్సెంట్ న్యాయం చేసింది. సాయి రోనక్- అమృత పెయిర్ స్క్రీన్ మీద ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది. సీనియర్ నటుడు సురేశ్ కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తండ్రిగా సురేశ్ ఒదిగిపోయారు. ఇంక సినిమాలో చాలానే ఇంట్రెస్టింగ్ పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా నెగిటివ్ రోల్ చేసిన అభిషేక్ విశ్వకర్మ తెలుగు ఆడియన్స్ ని మెప్పించేశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉండే ఒక సైకిక్ పాత్రలో అలరించాడు.
సైంటిస్ట్ గా చేసిన సమ్రాట్ పాత్ర పరిధి మేరకు మెప్పిస్తాడు. ఇంక మూవీలో చాలానే పాత్రలు ఉన్నాయి. పాల్ రాము, జబర్దస్త్ నాగి, ఫన్ బకెట్ రాజేశ్, ఫన్ బకెట్ భరత్, వైవా రాఘవ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. మూవీలో మంచి ఫన్ కూడా జనరేట్ చేశారు. ఇంక టెక్నికల్ విభాగం గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ గురించే చెప్పాలి. డెబ్యూ డెరెక్టర్ అయినా కూడా కల్యాణ్ చక్రవర్తి ఆడియన్స్ ని మెప్పించేశారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో మంచి మార్కులు కొట్టేశారు. ఒక మంచి ప్రేమకథను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇలా కూడా చెప్పచ్చా? అనేలా ఆశ్చర్య పరిచారు. ఇంక ఆశ్వీర్వాద్ ల్యూక్ సంగీతం మెప్పిస్తుంది. ఇన్టెన్స్ సన్నివేశాల్లో బీజీఎం ఆకట్టుకుంటుంది. లిరిసిస్ట్ రవివర్మ ఆకుల రాసిన వొద్దు వొద్దు సాఫ్ట్ వేర్, లవ్ యూ నాన్న సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శివరామ్ చరణ్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అటు నిర్మాతగా కూడా కల్యాణ్ చక్రవర్తి మంచి మార్కులు కొట్టేశారు. మూవీని రిచ్ గానే తెరకెక్కించారు.
చివరిగా: ఉత్కంఠ రేకెత్తించే టైమ్ ట్రావెల్ ప్రేమకథ..!