Vettaiyan Movie Review: రజినీకాంత్ వెట్టయాన్ మూవీ రివ్యూ!

Vettaiyan Telugu Movie Review & Rating: రజినీకాంత్- టీజీ జ్ఞానవేల్ కాంబోలో వచ్చిన వేట్టయాన్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? వేట్టయాన్ చిత్రం ఎలా ఉంది? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

Vettaiyan Telugu Movie Review & Rating: రజినీకాంత్- టీజీ జ్ఞానవేల్ కాంబోలో వచ్చిన వేట్టయాన్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? వేట్టయాన్ చిత్రం ఎలా ఉంది? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

వేట్టయాన్

10/10/2024, యాక్షన్, 2h 43m U/A
U/A
  • నటినటులు:రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, తదితరులు
  • దర్శకత్వం:టీజే జ్ఞానవేల్
  • నిర్మాత:శుభస్కరన్
  • సంగీతం:అనిరుధ్ రవిచంద్రన్
  • సినిమాటోగ్రఫీ:కతిర్

Rating

2.5

జైలర్ మూవీతో సూపర్ స్టార్ రజినీకాంత్ సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు వేట్టయాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.., జై భీమ్ మూవీతో సంచలనం సృష్టించిన TJ జ్ఞానవేల్ ఈ మూవీకి దర్శకుడు కావడం విశేషం. సున్నితమైన అంశాలతో కథని చెప్పే దర్శకుడికి.. ఓ మాస్ సూపర్ స్టార్ యాడ్ కావడంతో వేట్టయాన్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి.. ఈ మూవీ.. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉందా అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అతియాన్ (రజినీకాంత్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆలస్యంగా జరిగే న్యాయం.. అన్యాయంతో సమానమని నమ్ముతాడు. అందుకే అతియాన్ అంటే కన్యాకుమారిలో రౌడీలు అందరికీ భయం. అలాంటి అతియాన్ కి ఓసారి శరణ్య అనే స్కూల్ టీచర్ పేరుతో ఓ కంప్లైంట్ వస్తుంది. అతియాన్ తన ఇన్ఫార్మర్ బ్యాటరీ (ఫహద్ ఫాజిల్) సాయంతో అక్కడ పెద్ద డ్రగ్ రాకెట్ ని పట్టుకుంటాడు. దీంతో.. శరణ్యకి మంచి పేరు వస్తుంది. ఆమె.. అతియాన్ కి ఆప్తురాలు అవుతుంది. కాకపోతే.. అతియాన్ కి చెన్నైకి ట్రాన్స్ ఫర్ అయ్యాక శరణ్యని అతి కిరాతకంగా రేప్ చేసి, మర్డర్ చేస్తారు. ఆ హత్య తమిళనాడు ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది. పోలీసులపై విపరీతమైన ప్రెజర్ పడుతుంది. దీంతో.. శరణ్యని హత్య చేసిన నిందితుడిని పట్టుకుని, ఎన్ కౌంటర్ చేసే బాధ్యత అతియాన్ కి అప్పగిస్తారు. 48 గంటల్లో అతియాన్ ఆ మిషన్ పూర్తి చేస్తాడు. దేశం మొత్తం పోలీసులు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ కేసు విషయంలో సంచలన విషయాలు బయటకి తీస్తాడు. ఇక్కడి నుండి కథ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ అతియాన్ ఎన్ కౌంటర్ చేసింది ఎవరిని? అతనికి ఈ హత్యతో లింక్ ఏంటి? శరణ్యని చంపించింది ఎవరు? కథలో నటరాజ్ (రానా దగ్గుబాటి) పాత్ర ఏంటి? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి సమాధానమే ఈ మూవీ.

విశ్లేషణ:

జైభీమ్ సినిమాతో టీజే జ్ఞాన‌వేల్‌ ని సినిమా ప్రపంచం చూసే కోణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాకి ఆయన ఓ సున్నితమైన అంశాన్ని తీసుకున్నారు. చిన్న చిన్న మైనర్ డీటైల్స్ కూడా మిస్ కాకుండా, రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించారు. కాకపోతే.. ఆ మేకింగ్ లో ఎక్కడా సూర్య ఇమేజ్.. టీజే జ్ఞాన‌వేల్‌ కి భారం కాలేదు. కాకపోతే.. వేట్టయాన్ లో ఈ లెక్క తప్పింది. ఇందులో కూడా సమాజానికి పనికొచ్చే ఓ సున్నితమైన కథే ఉంది. కాకపోతే.. కథనాన్ని నడిపించే సమయంలో చాలా చోట్ల.. సూపర్ స్టార్ మాస్ ఇమేజ్ పంటి కింద రాయిలా అడ్డుపడుతూనే వచ్చింది. అలా అని.. రజినీకి ఓవర్ గా హైప్ ఇచ్చేయలేదు. కాకపోతే.. మాస్ సీన్స్ అన్నీ స్టోరీ నేరేషన్ కి అడ్డంకిగా మారాయి. దీంతో.. టీజే జ్ఞాన‌వేల్‌ తన కథకి 50 శాతం మాత్రమే న్యాయం చేయగలిగారు.

వేట్టయాన్.. ఓ మామూలు కమర్షియల్ సినిమాగానే మొదలవుతుంది. చాలాసేపు రజినీ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ వచ్చి పోతుంటాయి. అయితే.., శరణ్య హత్య తరువాతే కాన్ ఫ్లిక్ట్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి సినిమా ఓ క్రైమ్ సస్పెన్స్ ఫీల్ కల్పిస్తూ పరుగులు తీస్తుంది. ఇక.. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఈ కేసులోకి రావడం, 48 గంటల్లో నిందితుడిని ఎన్ కౌంటర్ చేయడం.. ఈ సీక్వెన్స్ అంతా అదిరిపోతోంది. కొంతసేపు లింగుస్వామి, హరి సినిమా చూస్తున్నామా అన్నంతగా హై ఫీల్ వస్తుంది. కాకపోతే.., ఎన్ కౌంటర్ తర్వాత అమితాబ్ ఇచ్చే ట్విస్ట్ తో ప్రేక్షకుల మతులు పోతాయి. ఇది కదా దర్శకుడు జ్ఞాన‌వేల్‌ టచ్ అనిపిస్తుంది. దీంతో.. వేట్టయాన్ ఓ బ్లాక్ బస్టర్ మూవీలా అనిపిస్తుంది.

సినిమా సెకండ్ ఆఫ్ కి వచ్చే సరికి సరైన రైటప్ లేకుండా పోయింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చాలా లూప్ హొల్స్ డైరెక్టర్ అలానే వదిలేశాడు. హీరో క్యారెక్టర్ కి హైప్ ఇస్తూ.. సినిమాకి కమర్షియల్ టచ్ ఇచ్చేశాడు. దీంతో.. ఏ పాయింట్ చుట్టూ కథ సాగాలో అది సైడ్ ట్రాక్ అయిపోయి, హీరో ఎలివేషన్స్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఇక్కడ దర్శకుడు కథ చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రజినీ సూపర్ మాస్ క్రేజ్ అడ్డంకిగా మారిపోయింది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి ట్విస్ట్ లు రివీల్ అయ్యే విధానం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో.. క్లైమ్యాక్స్ కూడా చప్పపడిపోయింది. ఇక.. సెకండ్ ఆఫ్ లెంత్, ఓవరాల్ డ్యూరేషన్ వేట్టయాన్ కి అతి పెద్ద మైనస్

నటీనటుల పనితీరు, టెక్నీకల్ విభాగం:

సూపర్ రజినీ కాంత్ గురించి, ఆయన స్టైల్ గురించి, స్క్రీన్ ప్రజెన్స్ గురించి.. ప్రత్యేకించి చెప్పడం కూడా సమంజసం కాదు. ఆయన ఎప్పటిలానే మెస్మరైజ్ చేశారు. కథ కోసం చాలా తగ్గారు కూడా. కాకుంటే.. ఆయనకి స్వతహాగా ఉన్న క్రేజ్.. కథనానికి అడ్డంకి అయ్యింది. ఇక.. రజినీ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ గురించి. ఇద్దరికీ చాలా మంచి రోల్స్ పడ్డాయి. వారు కూడా ది బెస్ట్ ఇచ్చేశారు. ఇక మంజు వారియర్ గ్లామరస్ గా కనిపించింది. చివరగా రానా.. కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇక టెక్నికల్ గా ఎక్కువ మార్కులు పడాల్సింది అనిరుధ్ మ్యూజిక్ అండ్ BGMకి. అనిరుధ్ యాజ్ యూజ్ వల్ గా డ్యూటీ ఎక్కేశాడు. కతీర్ సినిమాటోగ్రఫీ సూపర్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలకి పేరు పెట్టాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీజే జ్ఞాన‌వేల్‌ మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాడు. కాకపోతే స్టార్ వ్యాల్యూ అనేది అతనికి మేకింగ్ లో బ్యారియర్ గా మారిపోయింది.

ప్లస్ లు:

  • స్టోరీ బేస్ లైన్
  • రజినీకాంత్, అమితాబ్, ఫహద్ ఫాజిల్
  • ఫస్ట్ ఆఫ్
  • అనిరుధ్

మైనస్ లు:

  • టోటల్ సెకండ్ ఆఫ్
  • డ్యూరేషన్
  • కథనంలో పట్టు తప్పడం
  • క్లైమ్యాక్స్

రేటింగ్: 2.5/5

చివరి మాట:వేట్టయాన్ వేట సగమే బాగుంది!

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments