Lal Salaam Movie Review & Rating In Telugu: రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ రివ్యూ!

Lal Salaam Review in Telugu: రజినీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ రివ్యూ!

Lal Salaam Movie Review & Rating In Telugu: రజినీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన లాల్ సలామ్ సినిమా ఎలా ఉంది? ఎవరు ఎలా చేశారు? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

Lal Salaam Movie Review & Rating In Telugu: రజినీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన లాల్ సలామ్ సినిమా ఎలా ఉంది? ఎవరు ఎలా చేశారు? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

Lal Salaam

20240209, U/A
Action Drama
  • నటినటులు:Rajinikanth, Vishnu Vishal, Vikranth, Others
  • దర్శకత్వం:Aishwarya Rajinikanth
  • నిర్మాత:Subaskaran Allirajah
  • సంగీతం:A.R. Rahman
  • సినిమాటోగ్రఫీ:Vishnu Rangasamy

2

సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత రజినీకాంత్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి తెలియజేశారు. అలాగే ఓటీటీలో కూడా ఆ మూవీ సంచలనాలు నమోదు చేసింది. ఆ సినిమా తర్వాత రజినీకాంత్ ఎలాంటి మూవీతో వస్తారు? ఆయన లైనప్ ఎలా ఉండబోతోంది అంటూ చాలానే అంచనాలు నెలకొన్నాయి. అయితే రజినీ మాత్రం ఒక అతిథిపాత్రతో లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి.. ఆ లాల్ సలామ్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.

కథ:

ఒక పల్లెటూరిలో హిందువులు, ముస్లింలు ఎలాంటి గొడవలు, అరమరికలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉంటారు. కానీ, ఆ ఊరిలోక్రికెట్.. కొన్ని అనుకోని సంఘటనల వల్ల రెండు వర్గాల మధ్య విబేధాలు నెలకొంటాయి. అరుణ్(విష్ణు విశాల్) అనే కుర్రాడు ఒక గొప్ప క్రికెటర్ కావాలి అనుకుంటాడు. అలా అయితే తన జీవితం మారిపోతుంది అనుకుంటాడు. చిల్లమల్లరగా తిరిగే తన కొడుకు ఊరికి పేరు తీసుకొస్తాడంటూ ఆ తల్లి కూడా కలలు కంటుంది. కానీ, ఆ క్రికెట్ మ్యాచ్ లో జరిగిన ఒక గొడవలో అరుణ్ తన స్నేహితుడు అయిన షంషూద్దీన్ చేతిని నరికేస్తాడు. రంజీకి ఆడి.. ఆ తర్వాత ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటాడు.

తన కొడుకును అవిటివాడిని చేయగానే మెయినుద్దీన్(రజినీకాంత్)కు అరుణ్ పై కోపం పెరిగిపోతుంది. అప్పటి వరకు కొడుకుతో సమానంగా చూసుకున్నవాడు తర్వాత తన మనసు విరిగిపోతుంది. మరోవైపు అరుణ్ ని ఊరు కూడా వెలివేస్తుంది. షంషుద్దీన్ మాత్రం అరుణ్ పై పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఊరిలో కొత్త సమస్యలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎందుకు జరిగాయి? ఎంతో కలిసి మెలిసి ఉన్న హిందు- ముస్లింలు ఎందుకు గొడవలు పడ్డారు? అరుణ్- షంషుద్దీన్- మొయినుద్దీన్ మళ్లీ కలిసి పోయారా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే లాల్ సలామ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ మూవీలో రజినీకాంత్ చేసింది అతిథి పాత్రే అయినా ఎందుకో ఆ క్యారెక్టర్ లో సూపర్ స్టార్ ని ఊహించుకోలేరు. అక్కడక్కడ యాక్షన్ ఉన్నా కూడా రజినీ స్థాయికి తగినట్లు మాత్రం అనిపించదు. మెయినుద్దీన్ క్యారెక్టర్ తో మతం, సామరస్యం గురించి చెప్పించే డైలాగులు బాగుంటాయి. కానీ, ఎందుకో ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధంగా లేవు. తెలుగు ప్రేక్షకులు ఎంగేజ్ కాలేని ఇంకో అడ్డంకి ఏంటంటే ఈ మూవీలో తమిళ నేటివిటీ మరీ ఎక్కువగా ఉంటుంది. నిజానికి రజినీకాంత్ సినిమాలు అంటే తెలుగువాళ్లు కూడా చూసే విధంగా, ఎంగేజ్ అయ్యే విధంగానే ఉంటాయి. కానీ, ఈ మూవీలో మాత్రం తమిళ నేటివిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

సినిమాకి టర్నింగ్ పాయింట్ గా ఉండే తేరు జాతర సీన్స్, ఎమోషన్స్ చూడటానికి బాగానే ఉన్నా.. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ విధంగా అనిపించవు. ఈ సీన్స్ తమిళ్ లో బాగా క్లిక్ అయ్యే స్కోప్ ఉంది. ఈ మూవీలో కథ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐశ్వర్య రజినీకాంత్ చాలా ఎక్కువ లేయర్స్ ని టచ్ చేసినట్లు అనిపిస్తుంది. స్నేహం, ప్రేమ, పగ, మత సామరస్యం, ఊరి తగాదాలు, జాతర ఇలా చాలానే లేయర్స్ ని టచ్ చేశారు. కానీ, దేనినీ పూర్తిగా హ్యాండిల్ చేసినట్లు అనిపించదు. చాలా వరకు టచ్ చేసి వదిలేసినవే ఉన్నాయి. ఒక అంశానికి ఎంగేజ్ అవుతున్నారు అనుకునే సమయంలో మరో పాయింట్ స్క్రీన్ మీదకు వస్తుంది.

టెక్నికల్ విభాగం విషయంలో కూడా ఐశ్వర్య రజినీకాంత్ ఒక మిస్టేక్ చేశారు. ఈ మూవీలో రజినీకాంత్ కి సింగర్ మనో కాకుండా సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. రజినీ పాత్రకు కనెక్ట్ కాలేకపోవడానికి అది కూడా ఒక అడ్డంకి కావచ్చు. సాయికుమార్ ఎంతో బాగా డైలాగ్స్ చెప్పినా కూడా ఎందుకో సెట్ కాలేదు అనే భావన కలుగుతుంది. మరోవైపు ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా అంత అకట్టుకునే విధంగా లేదు. సాంగ్స్ అయితే అస్సలు ఎంగేజింగ్ గా అనిపంచవు. అలాగే బీజీఎం కూడా అక్కడక్కడ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫి కొత్తగా ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే.. లీడ్ యాక్టర్స్ అందరూ మెప్పిస్తారు. ఎవరి పాత్ర పరిధి మేరకు వాళ్లు ఆకట్టుకుంటారు. కానీ.. కథ, కథనం విషయంలోనే లాల్ సలామ్ మూవీ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.

ప్లస్ లు:

  • రజినీకాంత్
  • లీడ్ యాక్టర్స్

మైనస్లు:

  • కథనం
  • రొటీన్ స్టోరీ
  • తమిళ నేటివిటీ ఎక్కువ కావడం

రేటింగ్: 2/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments