Manjummel Boys Review in Telugu: మంజుమ్మల్‌ బాయ్స్‌ తెలుగు రివ్యూ

Manjummel Boys Movie Review & Rating in Telugu: ఈమధ్య కాలంలో విడుదలైన మాలీవుడ్‌ సినిమాలన్ని హిట్టు టాక్‌ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రేమలు, భ్రమయుగం విజయం సాధించగా.. మంజుమ్మేల్‌ బాయ్స్‌ అనే సినిమా కూడా ఇదే దారిలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుగులో రివ్యూ మీకోసం

Manjummel Boys Movie Review & Rating in Telugu: ఈమధ్య కాలంలో విడుదలైన మాలీవుడ్‌ సినిమాలన్ని హిట్టు టాక్‌ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రేమలు, భ్రమయుగం విజయం సాధించగా.. మంజుమ్మేల్‌ బాయ్స్‌ అనే సినిమా కూడా ఇదే దారిలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుగులో రివ్యూ మీకోసం

మంజుమ్మేల్‌ బాయ్స్‌

20240406, అడ్వెంచర్‌ థ్రిల్లర్‌, 2h 15m U
U
  • నటినటులు:సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, జీన్ పాల్ లాల్, చందు సలీంకుమార్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్
  • దర్శకత్వం:చిదంబరం
  • నిర్మాత:Babu Shahir, Soubin Shahir, Shawn Antony
  • సంగీతం:సుశిన్ శ్యామ్
  • సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్

Rating

3.25

సినిమాలంటేనే కొత్తదనానికి పెద్ద పీట వేస్తాయి. ఇక ఈ నెలలో మూడు మలయాళ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో మమ్ముట్టి నటించిన భ్రమయుగం సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా తెలుగులో కూడా రిలీజ్‌ అయ్యింది. అలానే ప్రేమలు సినిమా కూడా మంచి టాక్‌ తెచ్చుకోగా.. త్వరలోనే దీన్ని తెలుగులో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ వరుసలోనే మంజుమ్మల్‌ బాయ్స్‌ సినిమా ఫిబ్రవరి 22న మలయాళం ఈ సినిమా రిలీజ్‌ అయి బంపర్‌ హిట్‌ కొట్టింది. ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. మొత్తం ఇండియన్‌ సినిమా దృష్టినే ఆకర్షించింది. అలాంటి సినిమా తాజాగా తెలుగులో రిలీజ్‌ అయింది. మరి తెలుగులో ఆ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

కథ ఏంటంటే..

తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహల వద్ద జరిగిన ఓ విషాదాన్ని ఎదుర్కొన్న కొచ్చికి చెందిన మంజుమ్మల్‌కు చెందిన 11 మంది యువకుల కథే ఈ మంజుమ్మేల్‌ బాయ్స్‌ సినిమా. 2006లో జరిగిన రియల్ స్టోరీని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే.. కొచ్చికి చెందిన మంజుమ్మెల్‌ అనే ప్రాంతానికి చెందిన 11 మంది యువకులు కొడైకెనాల్ ట్రిప్ వెళ్తారు. మరి వారికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది.. వారంతా క్షేమంగా తిరిగి వచ్చారా లేదా అన్నదే సినిమా.

విశ్లేషణ:

సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్‌ పెద్దగా ఆకట్టుకోవు. ఇక ఆ తర్వాత కథలోకి తీసుకు వెళ్ళడానికి కూడా బాగా సమయం తీసుకున్నాడు దర్శకుడు. అందుకే కథ కొంచెం సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ అంతా కలిసి కొడైకెనాల్‌ ట్రిప్ బయలు దేరతారో అప్పుడు సినిమా వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత గుణ కేవ్స్ చూసేందుకు లోపలికి వెళ్లినప్పుడు సుభాష్ అందులో పడడంతో కథ ఒక్కసారిగా టర్న్‌ అవుతుంది. అప్పటి వరకు సరదాగా సాగిన సినిమా.. ఆ తర్వాత  నెక్ట్స్‌ ఏం జరుగుతుంది అని టెన్షన్‌ పడతారు ప్రేక్షకులు. సినిమా మొదటి 20 నిమిషాల్లో ప్రేక్షకులకి చూపిన ప్రతి విషయానికి క్లైమాక్స్‌కి లింక్ చేస్తూ డైరెక్టర్ చేసిన మ్యాజిక్ బాగుంది. చిన్ననాటి విషయాలను ప్రస్తుతానికి లింక్‌ చేస్తూ చేసిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాను నిలబెట్టింది. మంచి సర్వైవల్ థ్రిల్లర్‌గామంజుమ్మెల్ బాయ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎవరేలా చేశారంటే..

నటీనటుల విషయానికి వస్తే మెయిన్ పాత్ర సుభాష్‌గా శ్రీనాథ్ భాసి అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ మీద అతడిని చూస్తూ.. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో బాధపడ్డారంటే.. అతడి నటన ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక కుట్టన్‌ పాత్రలో శౌబిన్ షాహిర్ సరిగ్గా సరిపోయాడు. ఇక ఖైదీ ఫేమ్ జార్జ్ మరియన్ అలాగే మరియు మరికొందరు తమిళ నటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్స్‌ను కూడా మర్చిపోలేం.

టెక్నికల్‌ అంశాలు..

ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది.

బలాలు:

  • కథ
  • నటీనటుల పర్ఫామెన్స్‌

బలహీనతలు:

  • సాగతీత

రేటింగ్ : 3.25/5

చివరి మాట: బెస్ట్‌ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా నిలుస్తుంది.

Show comments