Simbaa Movie Review: అనసూయ, జగపతి బాబు నటించిన ‘సింబా’ సినిమా రివ్యూ! ఎలా ఉందంటే?

అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

సింబా

ఆగస్ట్ 8, సైంటిఫిక్ థ్రిల్లర్,
  • నటినటులు:అనసూయ భరద్వాజ్, జగపతి బాబు, శ్రీనాథ్ మాగంటి, కబీర్ సింగ్ తదితరులు
  • దర్శకత్వం:మురళీ మనోహర్ రెడ్డి
  • నిర్మాత:సంపత్ నంది, రాజేందర్ రెడ్డి
  • సంగీతం:కృష్ణ సౌరభ్
  • సినిమాటోగ్రఫీ:కృష్ణ ప్రసాద్

Rating

2

సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘సింబా’. అనసూయ భరద్వాజ్, జగపతి బాబు కీలక పాత్రలు వహించగా.. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీకి కథను అందించాడు. ఇక తన దగ్గరే శిష్యరికం చేసిన మురళీ మనోహర్ రెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు సంపత్ నంది. మరి ఈ కొత్త డైరెక్టర్ హిట్ కొట్టాడా? ఆ కొత్త కాన్సెప్ట్ లు ప్రేక్షకులను మెప్పించాయా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

హైదరాబాద్ లో ఓ దారుణ హత్య జరుగుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే మరికొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇక వీటి వెనక స్కూల్ టీచర్ అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్ మాగంటి) ఉన్నారని కనిపెట్టి, వారిని అరెస్ట్ చేస్తారు. అయితే వీరిని చంపడానికి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు. వాళ్లు జైల్లో ఉన్నా ఆ వ్యక్తిని చంపింది ఎవరు? చనిపోయిన వారందరూ బిజినెస్ మెన్ పార్థ(కబీర్ సింగ్) సంబధీకులే కావడం వెనక కారణం ఏంటి? పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన పురుషోత్తమ్ రెడ్డి(జగపతి బాబు) ఎవరు? వీళ్లందరికి సంబంధం ఏంటి? అన్నదే మిగిలిన కథ

విశ్లేషణ:

ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ రివేంజ్ స్టోరీ. కానీ డైరెక్టర్ ఈ స్టోరీకి సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే కాన్సెప్ట్ లను జోడించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. ఇక సినిమా మెుదలైన కొద్దిసేపటికే కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. అయితే రెగ్యూలర్ ఫార్మాట్ వచ్చే థ్రిల్లర్ మూవీస్ కంటే సింబా కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. సైంటిఫిక్ థ్రిల్లర్ అన్నప్పుడు కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ విషయంలో డైరెక్టర్ తేలిపోయాడు. సీన్లు అన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లుగానే సాగిపోతూ ఉంటాయి. ఇంటర్వెల్ కు అసలు ఏం జరుగుతుంది? వీళ్లు ఎందుకు అలా బిహేవ్ చేస్తూ హత్యలు చేస్తున్నారు? అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ.. సెకండాఫ్ లో వచ్చే ఎపిసోడ్స్ బోరింగ్ ఫీలింగ్ తీసుకొస్తాయి. అయితే సీరియస్ గా కథ నడుస్తుంది అనుకుంటున్న టైమ్ లోనే ఫాజిల్, ఇష్ట(దివి) మధ్య ప్రేమయాణంతో స్టోరీ గాడి తప్పుతుంది. పర్యావరణం, మెుక్కల గురించి సందేశం ఇద్దామనుకున్న డైరెక్టర్ కథను చెప్పే విషయంలో తడబడ్డాడు. ఇక క్లైమాక్స్ కూడా ఆడియెన్స్ ఊహకు తగ్గట్లుగానే ముగించాడు.

ఎవరెలా చేశారంటే?

అనసూయ ఈ సినిమాలో అదరగొట్టేసింది. ఒక పక్క స్కూల్ టీచర్ గా, మరో పక్క హత్యలు చేస్తూ విభిన్నమైన నటనతో మెప్పించింది. పర్యావరణ ప్రేమికుడిగా జగపతి బాబు కొత్తగా నటించాడు. వశిష్ట సింహ పోలీస్ క్యారెక్టర్ లో సరిగ్గా సరిపోయాడు. శ్రీనాథ్, దివి, అనీష్ కురివిళ్ల, కస్తూరి తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల సినిమాను హై రేంజ్ కు తీసుకెళ్తుంది. కొన్ని సీన్లకు కత్తెర పెట్టాల్సింది. సంపత్ నంది కథ అందించినప్పటికీ.. దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేసే క్రమంలో తన తొలి ప్రయత్నంలో డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి కాస్త తడబడ్డానే చెప్పాలి. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

బలాలు:

  • కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ కావడం
  • అనసూయ, జగపతి బాబు, సంపత్ నంది

బలహీనతలు:

  • అక్కడక్కడ స్లో నెరేషన్
  • రొటీన్ సీన్లు
  • కథనం

చివరి మాట: సింబా సందేశాన్ని ఇవ్వడంలో తడబడింది.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Show comments