Deadpool & Wolverine: డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Deadpool & Wolverine Review In Telugu: ఆరు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత.. డెడ్‌పూల్ ఫ్రాంచైజీ నుంచి మూడవది అయిన డెడ్‌పూల్ అండ్‌ వాల్వెరైన్‌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.

Deadpool & Wolverine Review In Telugu: ఆరు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత.. డెడ్‌పూల్ ఫ్రాంచైజీ నుంచి మూడవది అయిన డెడ్‌పూల్ అండ్‌ వాల్వెరైన్‌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్

26-07-24, యాక్షన్‌ థ్రిల్లర్‌, 2h 7m A
థియేటర్స్ లో
  • నటినటులు:ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ తదితరులు
  • దర్శకత్వం:షాన్ లెవీ
  • నిర్మాత:కెవినీ ఫీజ్, లారెన్ షూలర్ డానర్, ర్యాన్ రెనాల్డ్స్, షాన్ లెవీ
  • సంగీతం:రాబ్ సిమోన్‌సెన్
  • సినిమాటోగ్రఫీ:జార్జ్ రిచర్డ్

Rating

3/5

మార్వెల్ సిరీస్ చిత్రాలను అమితంగా అభిమానించే ప్రేక్షకులు, అభిమానులకు డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అమెరికన్ సూపర్ హీరో నేపథ్యంగా సాగే మార్వెల్ కామిక్ పాత్రలతో కూడినది ఈసినిమా. ఈ దీన్ని మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. నేడు అనగా జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..

కథ ఏంటంటే..

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా విషయానికి వస్తే.. వేడ్‌ విల్సన్‌, అకా డెడ్‌పూర్‌(ర్యాన్‌ రేనాల్డ్స్‌) ఇద్దరు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ డ్రస్‌ను తీసేసి కారు సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. ఇలా ఉండగా.. తన పుట్టిన రోజున.. టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు అతడిని ఎత్తుకెళ్లి.. ఎర్త్ 616 జాయిన్ అవ్వమంటారు. అయితే పారాడాక్స్ నుంచి టెమ్ ప్యాడ్ దొంగలించి మల్టీవెర్స్‌కు వెళ్లి లోగన్ వేరియెంట్‌ను సేవ్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో లోగన్‌తో కలిసి వేడ్ ఏం చేశాడు.. మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు.. పారాడాక్స్‌ను ఎలా ఎదురించారు. కాసాండ్రా ఎత్తులను ఎలా చిత్తు చేశారు.. టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ..

ఈ సినిమాలో.. డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్‌గా ర్యాన్ రెనాల్డ్స్ ఎప్పటిలానే తనదైన నటనతో యాక్షన్‌తో పాటు వినోదాన్ని పండించడంలో సక్సెస్‌ అయ్యాడు. లోగన్ అలియాస్ వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్‌ చేసిన సీన్లను అద్బుతంగా పండించాడు. యాక్షన్, ఫన్, కామెడీ అనే తేడా లేకుండా సినిమా ప్రారంభం నుంచి అన్ని సీన్లలో రెచ్చిపోయారు. కసండ్రాగా నటించిన ఎమ్మా కోరిన్ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా యాక్షన్ మోడ్‌లో వెళ్లుంది.

ద్వితియార్ధంలో ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకాండ్‌ ప్రారంభం నుంచి బాగానే ఉన్నా.. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్‌ వరకు కాస్త బోరింగ్‌ ఉంది. థోర్: లవ్ అండ్ థండర్, ది మార్వెల్స్, ఎటర్నల్స్ కంటే డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా ఆధ్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

టెక్నికల్‌ అంశాలు..

సాధారంణంగా సూపర్‌ హీరోల సినిమాలు అంటే.. గ్రాఫిక్స్‌ వర్క్‌ కీలకం అనే చెబుతారు. ఇక ఈ సినిమాలోని సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రాఫిక్‌ వర్క్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కెమెరా వర్క్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకొనేలా ఉంటుంది. డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ తెలుగు వర్షన్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

చివరి మాట: మార్వెల్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని కూడా పంచుతుంది.

 

Show comments