Gangs of Godavari Review & Rating in Telugu: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మూవీ రివ్యూ!

Gangs of Godavari: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మూవీ రివ్యూ!

Gangs of Godavari Review & Rating in Telugu: విశ్వక్‌ సేన్‌ నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

Gangs of Godavari Review & Rating in Telugu: విశ్వక్‌ సేన్‌ నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి

మే 31, U/A
యాక్షన్‌ డ్రామా
  • నటినటులు:విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టి, అంజలి, నాజర్‌, హైపర్‌ ఆది తదితరులు
  • దర్శకత్వం:కృష్ణ చైతన్య
  • నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
  • సంగీతం:యువన్‌ శంకర్‌ రాజా
  • సినిమాటోగ్రఫీ:అనిత్‌ మదాడి

2.75

మాస్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరో విశ్వక్‌సేన్‌. మాస్‌ కా దాస్‌ అనే బిరుదును సొంతం చేసుకున్న విశ్వక్‌ వరుస సినిమాలతో బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన విశ్వక్‌.. ఇప్పుడు ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకుని.. మూవీపై అంచనాలు పెంచేశాయి. వీటికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేసింది చిత్ర బృందం. ఇప్పటికే చాలా సార్లు విడుదల వాయిదా పడినా.. ఎట్టకేలకు మే 31 శుక్రవారం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ బొమ్మ సిల్వర్‌ స్క్రీన్‌పై పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? విశ్వక్‌ ఖాతాలో మరో క్రేజీ హిట్‌ పడిందా? లేదా? అనేది ఈ రివ్వూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కథ

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ 90ల్లో సాగే కథ. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) ఒక అనాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ గాలికి తిరుగుతుంటాడు. అదే ఊర్లో ఉండే వేశ్య రత్నమాల(అంజలి).. రత్నకు మంచి ఫ్రెండ్‌. ఎవర్వనైనా వాడుకుని ఎదగాలి అనుకునే మనస్తత్వం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక దందా గురించి తెలుస్తుంది. ఆ ఇసుక మాఫియా వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నాడని తెలుసుకుని.. అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామికి రైట్‌ హ్యాండ్‌లా మారుతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి క్లోజ్‌ అవుతాడు.

ఇలా డబ్బు కోసం ఒకర్ని, ప్రేమ కోసం మరిన్ని ఇద్దరు రాజకీయ నాయకులను వాడుకుని.. రత్నాకర్‌ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తమను వాడుకున్న రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకుంటాడు? పిల్లనిచ్చిన మామను రత్నాకర్‌ ఎందుకు చంపాల్సి వస్తుంది? ఆ తర్వాత రత్నాకర్‌, బుజ్జి మధ్య ఏం జరుగుతుంది? రత్నాకర్‌ ఎదుగుదలకు కారణమైన వారే అతన్ని చంపాలని ఎందుకు కత్తి కట్టారు? ఇలాంటి ఆసక్తి గోలిపే విషయాలు తెలియాలంటే.. కచ్చితంగా సినిమా చూసి తీరాల్సిందే.

విశ్లేషణ

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఊరి రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కానీ, ఈ సినిమాను దర్శకుడు ప్రజెంట్‌ చేసిన విధానం బాగుంది. కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గోదావరి జిల్లాలపై సినిమా అంటే కొబ్బరి చెట్లు, వెటకారపు మాటలు, ప్రశాంత వాతావరణం ఇవే చూపించే వారు. కానీ, ఇందులో మాత్రం గోదావరి జిల్లాలో ఉండే ఇంకో కోణం చూపించినట్లు కనిపించింది. ఊరి రాజకీయాలు ఎలా ఉంటాయి? మనోళ్లే మనకు వెన్నుపోటు ఎలా పోడుస్తారు? అనే విషయాలకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. అయితే.. కాస్త హింస ఎక్కువ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇబ్బంది పడొచ్చు.

నటీనటులు

రత్న అలియాస్‌ రత్నాకర్‌ పాత్రలో విశ్వక్‌ ఒదిగిపోయాడు. తన గత సినిమాలను బట్టి చూస్త.. ఇది విశ్వక్‌కు చాలా భిన్నమైన పాత్ర. గోదావరి యాసను ఇంకా బాగా మాట్లాడాల్సింది అనే ఫీలింగ్ కలుగుతుంది. రత్నమాల అనే పాత్రలో అంజలి నటన సినిమాకు బలం అనే చెప్పాలి. ఇక బుజ్జిగా హీరోయిన్‌ నేహా శెట్టి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఐటమ్‌ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌ దుమ్మురేపింది. ఇక విలన్‌గా గగన్‌ విహారి పర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు కూడా వారి పాత్ర పరిధి మేర బాగానే నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. యువన్‌ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమా ప్లస్‌ పాయింట్‌. పాటతో పాటు బీజీఎం కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రాఫీ బాగుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పనిచెప్తే బాగుండూ అనిపించింది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

ప్లస్‌లు

  • విశ్వక్‌ సేన్‌ నటన
  • డైలాగ్స్‌
  • సంగీతం

మైనస్‌

  • స్క్రీన్‌ ప్లే
  • రొటీన్‌ స్టోరీ
  • ఓవర్‌ మాస్‌ సీన్స్‌

చివరి మాట: వైలెన్స్‌ ఎక్కువైన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

Show comments