Bhamakalapam-2 Movie Review: భామా కలాపం-2 రివ్యూ.. ప్రియమణి మరోసారి మెప్పించిందా?

Bhamakalapam-2 Movie Review: స్టార్ హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన భామా కలాపం పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామా కలాపం 2 ఎలా ఉంది? ప్రియమణి మరోసారి మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

Bhamakalapam-2 Movie Review: స్టార్ హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన భామా కలాపం పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామా కలాపం 2 ఎలా ఉంది? ప్రియమణి మరోసారి మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. దర్శకులు తమ టాలెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన ‘భామా కలాపం’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో.. దానికి సీక్వెల్ ల్ గా ‘భామా కలాపం 2’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రంతో మరోసారి ప్రియమణి మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

పార్ట్ 1లో అనుపమ(ప్రియమణి) యూట్యూబ్ ఛానెల్ లో వంటలు చేస్తుంది. కోల్ కత్త మ్యూజియంలో రూ. 200 కోట్ల విలువైన కోడి గుడ్డు మాయమవడం, ఆ సమస్యల్లోంచి బయటపడటం పార్ట్ వన్ లో చూపించారు. ఈ ప్రాబ్లెమ్ నుంచి తప్పించుకుని అనుపమ ఇల్లు మారడంతో.. పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో హోటల్ ప్రారంభిస్తుంది అనుపమ. భాగస్వామిగా పని మనిషి శిల్ప(శరణ్య ప్రదీప్)ను కూడా చేర్చుకుంటుంది. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఓ సమస్య వస్తుంది. దాని తీర్చడం కోసం డ్రగ్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిని కలుస్తారు. అయితే అతడు వారికి రెండు ఆప్షన్లు ఇస్తాడు. అవి ఏంటి? అసలు రూ. 1000 కోట్ల కోడి పుంజు కథ ఏంటి? అందులో ఏముంది? దాన్ని అనుపమ ఎందుకు దొంగతనం చేయాలనుకుంది? ఆ వివరాలన్నీ తెలియాలంటే భామా కలాపం 2 చూడాల్సిందే.

విశ్లేషణ:

తొలి భాగం హిట్టైతే.. వచ్చే రెండో పార్ట్ పై భారీ అంచనాలు ఉండటం సహజం. దీంతో సాధారణంగానే డైరెక్టర్ పై మేకర్స్ పై ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడటమే అసలైన విజయం. ఒక కోడి గుడ్డు చుట్టూ కథ అల్లుకుని భామా కలాపంతో సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అభిమన్యు. ఇక మళ్లీ ఇప్పుడు భామా కలాపం 2తో కోడి పుంజు చుట్టూ స్టోరీ అల్లుకుని మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సీక్వెల్స్ స్టోరీ ఒక్కటే అయినా.. ట్రీట్ మెంట్ లో విభిన్నత చాటాడు దర్శకుడు. ఇల్లు మారడంతో స్టోరీని స్టార్ట్ చేసి.. నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లిన తీరు బాగానే ఉంది.

తమ ప్రమేయం లేకుండానే నేరస్థులను పట్టించే క్యారెక్టర్ లో అనుపమగా ప్రిమయణి నటన సినిమాకే హైలెట్. కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను ఇంట్రడ్యూస్ చేస్తూ.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తూ.. మధ్యలో అనుమప-శిల్పల కామెడీతో మెప్పించాడు. జుబేదా గ్లామర్ తో ఆకట్టుకోగా.. స్లోగా సాగే నెరేషన్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. ఈ క్రమంలోనే అనుపమ చేసిన యాక్సిడెంట్ కథను కీలక మలుపుతిప్పుతుంది. విలన్ తాషీర్ క్యారెక్టర్ ఎంట్రీ కావడం, ఇటలీలో ఉన్న ఆంటోనీ లోబో, కోడి పుంజు బొమ్మను విక్రయించేందుకు స్మగ్లర్లతో డీలింగ్ చేయడంతో.. కథ ఊపందుకుంటుంది. ఇలా ఒక్కో క్యారెక్టర్ రావడంతో.. ఒక్కో అంశం ప్రేక్షకుడికి ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీంతో నెక్ట్స్ ఏం జరగబోతోందో అన్న ఇంట్రెస్ట్ ను కలిగించాడు డైరెక్టర్.

రూ . 1000 కోట్ల కోడి పుంజు బొమ్మపై అనుమప, విలన్ తాషీర్ మాత్రమే ఎందుకు కన్నేశారని కారణం తెలుసుకున్న ప్రేక్షకుడికి ప్రీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అయితే ఇక్కడి వరకు ఎంగేజింగ్ గా మూవీని తీసుకొచ్చి.. చివర్లో పట్టు విడిచినట్లు అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్లకు తుపాకులు ఇవ్వడంతో.. ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థం కాక ప్రేక్షకులు కన్ప్యూజన్ కు గురవుతారు. అసలు క్లైమాక్స్ లో కోడి పుంజు బొమ్మ ఏమైందో చూపించకపోవడం గమనార్హం. చివర్లో భామా కలాపం 3 ఉంటుందని చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ అభిమన్యు.

నటీ, నటుల పనితీరు:

అనుపమగా ప్రియమణి వన్ విమెన్ షోతో మెప్పించిందనే చెప్పాలి. ఈ మూవీకి ఆమె నటనే హైలెట్. డైరెక్టర్ ఆమె కోసమే ఈ పాత్ర రాసిపెట్టాడా అనిపిస్తుంది. ఇక శిల్పగా శరణ్య కనిపించినంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. మరో క్యారెక్టర్ సీరత్ కపూర్ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది. మిగతా పాత్రలు ఆంటోనీ లోబో, తాషీర్ తమ విలనిజంతో ఆకట్టుకుంటారు. ప్రేక్షకులు వారిని గుర్తుపెట్టుకుంటారనడంలో అతిశయోక్తిలేదు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ అతిథి పాత్రలో కాసేపు సందడి చేశాడు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దీపక్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రేక్షకుల కన్నులకు కనువిందు చేశాడు. ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం, విప్లవ్ నైషద ఎడిటింగ్ బాగున్నాయి. డైరెక్టర్ అభిమన్యు మరోసారి సక్సెస్ కొట్టాడనే చెప్పాలి.

బలాలు

  • ప్రియమణి నటన
  • కథలో ములుపులు
  • టీమ్ వర్క్

బలహీనతలు

  • కొన్ని ల్యాగ్ సీన్లు
  • ప్రీక్లైమాక్స్

చివరి మాట: నవ్వుల సస్సెన్స్ థ్రిల్లర్ ‘భామా కలాపం 2’

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Show comments