Idream media
Idream media
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం ప్రపంచం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కడి యుద్ధం, సామాన్య ప్రజల ఆర్తనాదాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి బయటకు రావడానికి సహాయం చేయమని కోరుతూ భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందినవారు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ యుద్ధంలో సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు కూడా రష్యా మీద అమెరికా తమ వ్యూహాలను, ఒత్తిడిని ఉపయోగిస్తోంది. ఐతే జో బిడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇక దానికి తోడు రష్యా పద్దతి సరైనది కాదు అని ఇప్పటికే పలు దేశాలు, కంపెనీలు.. అనేక ఆంక్షలు విధించాయి. ఇప్పుడు రష్యా కూడా రివర్స్ అయింది. తమ మీద ఆంక్షలు విధించిన వారి మీద ఆంక్షలు విధిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్, యాప్ స్టోర్ సేవలను రష్యా బ్లాక్ చేసినట్టు సమాచారం. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్ లాంటివి అన్నీ అమెరికాకు చెందిన సంస్థలే. బీబీసీ బ్రిటన్ నుంచి పనిచేస్తోంది. వీటి పై ఆంక్షలంటే… అమెరికా, బ్రిటన్ దేశాలతో రష్యా సోషల్ మీడియా పోరుకు దిగినట్టే. గూగుల్, యూట్యూబ్ కూడా రష్యన్ స్టేట్ మీడియా తమ ద్వారా ఆదాయాన్ని అర్జించకుండా నిషేధం విధించాయి. మరోపక్క ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక చర్యలు తీసుకున్నందుకు బ్లింకెన్ కూడా ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నిర్ణయం అసమంజసమైనదని, చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. తాజాగా రష్యాలో తమ ఉత్పత్తులు, సర్వీసుల కొత్త విక్రయాలను రద్దు చేస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. గతంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో నైక్, యాపిల్, హెచ్ అండ్ ఎం, ఐకియా వంటి పలు పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నాయి. కొత్త అమ్మకాలను సస్పెండ్ చేయడంతో పాటు, అమెరికా ఆంక్షలకు అనుగుణంగా రష్యాలో మా వ్యాపారం నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.