BRS ఎమ్మెల్యే విషయంలో హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..!

BRS MLA Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయంటూ ఆయనకు హైడ్రా నోటీసులు జారీ చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అంతేకాక హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

BRS MLA Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయంటూ ఆయనకు హైడ్రా నోటీసులు జారీ చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అంతేకాక హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమంగా నిర్మాణలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. చెరువులు, జలశాయలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణలను కూల్చి వేస్తుంది. ఇప్పటికే మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ తో సహా అనేక అక్రమకట్టడాలను హైడ్రా కూల్చి వేసింది. అంతేకాక మరికొన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. మరి.. ఆ ఊరట ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయంటూ ఆయనకు హైడ్రా నోటీసులు జారీ చేసిన తెలిసిందే. హైడ్రా నోటీసులపై రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ విద్యాసంస్థలు అన్ని అనుమతులతోనే నిర్మించామని, ఆక్రమణల పేరుతో అధికారుల్లో తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పల్లా హైకోర్టును కోరారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిక సంబంధించిన విద్యాసంస్థల కూల్చివేత విషయంలో స్టే విధించింది. తదుపరి విచారణ ముగిసే వరకు అనురాగ్, నీలిమ విద్యాసంస్థలను కూల్చొద్దని హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కొర్రెముల, నల్లచెరువులకు సంబంధించిన పూర్తి రికార్డులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ నిర్మాణాలపైన బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. అలానే హైడ్రా దృష్టిలో ఉన్న కట్టడాలపైనే కాకుండా సామాన్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కూడా స్పందిస్తూ సదరు నిర్మాణాల ఓనర్లలకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘట్‌కేసర్ మండలం వెంటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్‌లో ఉన్న భూమిని ఆక్రమించి విద్యాసంస్థలు నిర్మించారంటూ స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే హైడ్రా నుంచి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు అందాయి. ఆయనతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు చెందిన మరికొన్ని విద్యాసంస్థలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా హైడ్రా.. అక్రమనిర్మాణాలను చేపట్టిన వారికి డీహైడ్రేషన్ తెప్పిస్తుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. హైడ్రా తీసుకుంటున్న చర్యలపై సామాన్యుల నుంచి మంచి స్పందన వస్తుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments