160లో సున్నా తీసేయాలా అచ్చెన్నా..!

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల తెగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఎన్నికలంటూ వస్తే టీడీపీ 160 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైకు దొరికితే చాలు.. ఆ లైను లేనిదే ఆయన మాటలు ఉండడం లేదు. ఈ రోజు కూడా అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అలా చెప్పుకోవడంలో తప్పులేదు కానీ.. పరిస్థితులను చూస్తూ కూడా అలాంటి ప్రకటనలు చేస్తుండడంపై సొంత పార్టీలోనే నవ్వులు పూస్తుండగా, సామాజిక మాధ్యమాల్లో దీనిపై చలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల అచ్చెన్నాయుడు, ఆర్కే రోజా మధ్య సవాళ్ల పర్వం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్‌ చేశారని రోజా ఎద్దేవా చేశారు. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు‘ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్‌ చేస్తున్నారని, అచ్చెన్న గానీ, చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా అన్ని సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమే అని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ‘నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా..’ అంటూ సవాల్‌ విసిరారు. అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో స్పందించారు. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని ప్రతి సవాల్‌ విసిరారు.

దీనిపై మరోసారి మరింత ఘాటుగా స్పందించారు రోజా. ‘నేను గెలిస్తే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కాదు.. వాళ్లు 23 మంది రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలిస్తే నేనే పోటీ చేయను అంటూ’ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతోపాటు, అచ్చెన్నాయుడు చీటికిమాటికి వల్లె వేస్తున్న 160 సీట్ల అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. 160లో కుడివైపు ఉన్న సున్నా తీసేస్తే మిగిలే 16 వచ్చినా టీడీపీ కి గొప్పే అని కొందరు.. 160 సంగతి సరే.. కనీసం అధినేత చంద్రబాబును గెలిపించుకోండి ముందు.. అని మరికొందరు చలోక్తులు…

Show comments