పాకిస్థాన్ కు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్.. రేవంత్ సర్కార్ పై KTR సంచలన ఆరోపణలు!

KTR Comments on Musi River Development Project: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ఆరోపించారు.

KTR Comments on Musi River Development Project: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ఆరోపించారు.

హైదరాబాద్ లోని మూసీ నది సుందరీకరణ పేరుతో కొన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పనులను పాకిస్థాన్ కు చెందిన కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫతేపూర్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. గతంలో BRS సర్కార్ నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు-STPలను వినియోగించుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫతేపూర్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లిన కేటీఆర్.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తున్నట్లు ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడుతూ..”మూసీ నది సుందరీకరణ చేస్తున్నాం అని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ.. మీరు కొత్తగా మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం గతంలో మూసీ ప్రక్షాళన కోసం రూ. 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో మెుత్తం 31 సీవేజ్ ట్రీట్ మెంట్లను నిర్మించింది. దాదాపు అవి పూర్తి కావొచ్చాయి. మీరు నిధులు విడుదల చేస్తే.. ఇంకో మూడు నెలల్లో అవి పూర్తి అవుతాయి. వాటిని మీరు వినియోగించుకోండి. ఇక మూసీ ప్రాజెక్ట్ పై సీఎం మాటలకు మిగతా మంత్రుల మాటలకు పొంతన కుదరడం లేదు. ఒకరు రూ. 1.50 లక్షల కోట్లు అంటే.. ఇంకొకరు రూ. 70 వేల కోట్లని, మరోకరు రూ. 50 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్తుండటంతో మాకు అనుమానాలు వస్తున్నాయి. మూసీ పేరుతో వేల కోట్లు కుంభకోణం జరగబోతోందని మాకు డౌట్ వస్తోంది” అంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై కూడా స్పందించారు కేటీఆర్. హైడ్రా కూల్చివేతలు కాంగ్రేస్ నాయకులకు ఒకతీరుగా.. సామాన్య ప్రజలకు మరోతీరుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో చర్చించి త్వరలోనే హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న పనులు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే చాలని కేటీఆర్ సూచించారు. ఇక పబ్లిసిటీ స్టంట్స్ తో గవర్నమెంట్ ను ఎక్కువ కాలం నడపలేరని విమర్శించారు. త్వరలోనే హైదరాబాద్ లో నిర్మించిన 31 సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సందర్శిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Show comments