కవితకు బెయిల్ రావడంపై CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Revanth Reddy Comments On Kavitha Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం స్కాం కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy Comments On Kavitha Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం స్కాం కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమెకు మంగళవారం బెయిల్ వచ్చింది. మార్చి 15న అరెస్టైన కవిత..దాదాపు ఐదు నెలల పాటు తీహార్ జైలు ఉన్నారు. పలుమార్లు బెయిల్ గురించి పిటిషన్లు వేసిన కోర్టు తిరస్కరించింది. ఎట్టకేలకు సోమవారం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయగా..మంగళవారం విడుదలైంది. ఈ క్రమంలో కవితకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచిందంటూ కవిత ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ కీలక నేతలతో సహా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కవిత బెయిల్ పై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కవితకు ఎలా బెయిల్ వచ్చిందో తెలుసంటూ వివరించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేసిందని, అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందంటూ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా బెయిల్ రాలేదని గుర్తుచేశారు.

దేశంలో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు చాలా మంది అరెస్టయ్యారు. మార్చి నెలలో కవితను విచారణకు పిలిచిన ఈడీ… ఆ తరువాత అరెస్టు చేసింది. మార్చి 15 నుంచి ఆగస్టు 27 వరకు కవిత తీహార్‌ జైల్లో ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వస్తూ.. పిడికిలి బిగించి.. తన కోసం వచ్చిన వారికి అభివాదం తెలిపారు కవిత. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మొదట తన కుమారున్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. గట్టిగా హత్తుకుని ఎమోషనలయ్యారు.

ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కవిత అరెస్టునే రాజకీయ అస్త్రంగా బీఆర్ఎస్ పై సంధించారు. తాజాగా ఆమె బయటకు రావడంతో మరో వ్యూహం కోసం సిద్ధం కావాల్సి ఉంది. ఇదే సమయంలో కవిత బయటకు రావడంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచనుంది. మొత్తంగా ఎమ్మెల్సీ కవితకు బెయిలు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments