మాన‌వ‌త్వంలో మంత్రులూ జ‌గ‌న్ దారిలో..

అధికార హోదా కొంద‌రి క‌ళ్లు క‌ప్పేస్తుంది. కార్య‌క్ర‌మాల్లో బిజీ మ‌రికొంద‌రిలో మాన‌వ‌త్వాన్ని దూరం చేస్తుంది. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో ఈ రెండూ లేవ‌ని చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. ప్ర‌ధానంగా ఈ నెల‌లోనే రెండు సార్లు ఆయ‌న ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకున్నారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ కు దారి ఇచ్చి.. అందులో ఉన్న రోగుల్ని కాపాడారు. అంతేకాదు.. అలాంటి సంద‌ర్భాల్లో త‌న ఆదేశాలు లేకుండానే కాన్వాయ్ ను ఆపి స‌త్వ‌రచ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌ద్ర‌తా సిబ్బందికి పేర్కొన‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌యం. కొత్త‌గా మంత్రులైన ఇద్ద‌రు స్పందించిన తీరు కూడా నాయ‌కుడికి త‌గిన విధంగానే ఉంది.

కొత్తగా మంత్రులైన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గుడివాడ అమర్నాథ్ ఇద్దరికీ ఒకే రోజు ఒకే విధమైన అనుభవం ఎదురైంది.కానీ వాళ్లను అధికారిక హోదా మాయ చేయలేకపోయింది. సాటి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్న కామన్ సెన్స్ హుందాగా ఆలోచింపజేసింది. ఆ ఇద్దరిలో ఒకరు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాగా మరొకరు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. విశాఖ నుంచి అనకాపల్లి వైపు మంత్రి అమర్నాథ్ కాన్వాయ్ వెళుతుండగా….లంకెలపాలెం దగ్గర ఓ బైక్ ప్రమాదానికి గురైనట్టు గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి సొంత వాహనంలో బాధితులను ఆసుపత్రికి తరలించారు.

ఇక డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూడా అంబులెన్స్ లో ఉన్న రోగి ప్రాణాలను కాపాడారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన ముత్యాల నాయుడుకి ఎమ్మెల్యేలు,కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆయన ర్యాలీ నేషనల్ హైవే మీద వెళుతుండగా అనకాపల్లి-యలమంచిలి మధ్య అంబులెన్స్ చిక్కుకుపోయింది. దీంతో తాళ్లపాలెం దగ్గర స్వయంగా ముత్యాలనాయుడు పోలీసులను అప్రమత్తం చేశారు. ర్యాలీ ఆపించి మరీ అంబులెన్స్ ముందుకు వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇప్పించారు. ఒకే రోజు ఇద్దరు మంత్రులు స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. నాయ‌కుడికి త‌గ్గ మంత్రులు అని స్థానికులు కొనియాడారు.

Show comments