Krishna Kowshik
ఓటీటీల్లో కొత్త జోనర్ స్టార్ అయ్యింది. మాస్ మూవీస్సే కాదూ క్లాస్ పిక్చర్స్ కూడా అలరిస్తున్నాయి. అందులో ఫ్యామిలీ డ్రామా కూడా బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఓ మంచి సినిమా ప్రముఖ ఓటీటీల్లో అలరిస్తుంది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే...?
ఓటీటీల్లో కొత్త జోనర్ స్టార్ అయ్యింది. మాస్ మూవీస్సే కాదూ క్లాస్ పిక్చర్స్ కూడా అలరిస్తున్నాయి. అందులో ఫ్యామిలీ డ్రామా కూడా బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఓ మంచి సినిమా ప్రముఖ ఓటీటీల్లో అలరిస్తుంది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే...?
Krishna Kowshik
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ డిమాండే. మాస్ సినిమా కూడా థియేటర్లకు రప్పిస్తుందో లేదో తెలియదు కానీ.. ఫ్యామిలీ మూవీ బాగుంటే.. కుటుంబమంతా థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ చాలా సినిమాలు ఫ్రూవ్ చేశాయి. అయితే ఈ ఫ్యామిలీ డ్రామాలో కాస్త ఫన్, ప్రస్టేషన్‌తో పాటు సోషల్ మెసేజ్, క్రైమ్ కూడా ఉంటే.. వినడానికి వింతగా ఉన్న ఈ టైప్ జోనర్ మూవీస్ ఇటీవల కాలంలో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో కూడా ఈ తరహా జోనర్ కథలు పుట్టుకు వస్తున్నాయి. అనూహ్యంగా వీటికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. కేవలం థ్రిల్లర్, హార్రర్, క్రైమ్, సస్పెన్సే కాదూ..ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా కూడా ఆడియన్స్ పెరిగారు.
ఇంట్లో భార్యా భర్తల మధ్య జరిగే సన్నివేశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎఫ్ 2 మూవీ ఈ తరహా మూవీనే. కానీ.. భర్తను వేధించే భార్య.. భార్యను వేధించే భర్త ఆ తరహా కథలు రావడం చాలా అరుదు. ఇవి సున్నితమైన అంశం. వీటిని తెరపై చూపించాలంటే సాహసమనే చెప్పాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా.. సొసైటీలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా.. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి. ఏమాత్రం తేడా వచ్చింది.. అతడికి నెక్ట్స్ సినిమా ఉండదు. అందుకే ఈ జోనర్ వైపు అడుగులు పడటం లేదు. ఇలాంటి సినిమాలు మలయాళ ఇండస్ట్రీలో వస్తుంటాయి. గతంలో ద గ్రేట్ ఇండియన్ కిచెన్, జయ జయ జయ జయహే కాన్సెప్ట్ అంతా.. భర్త చేతిలో హింసకు గురౌతున్న భార్యల గురించి చెబుతుంది. ఆ తర్వాత భర్త నుండి విముక్తి పొందుతారు అనుకోండి.
ఇప్పుడు ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించి అబ్బుర పడిచింది హిందీ ఇండస్ట్రీ. అదీ కూడా ఓటీటీలో రిలీజై మంచి రివ్యూస్ రాబట్టుకోవడమే కాదూ.. మంచి ఎంటప్ట్ అంటూ ప్రశంసలు అందుకుంది. అలాగే ఓటీటీ విభాగంలో 11 నామినేషన్లకు ఎంపికయ్యింది ఈ చిత్రం. ఇంతకు ఆ మూవీ పేరు ఏంటంటే.. డార్లింగ్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ భార్యా భర్తలుగా నటించారు. షెఫాలి షా, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. 2022లో ఆగస్టు 5న నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఇది ఓ ఫ్యామిలీ రివేంజ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇక కథ విషయానికి వస్తే.. బద్రు (అలియా భట్), హంజ షేక్ (విజయ్ వర్మ) ప్రేమించుకుంటారు. కానీ హంజకు ఉద్యోగం లేకపోవడంతో వీరి ప్రేమను తిరస్కరిస్తుంది బద్రు తల్లి షంషు (షెఫాలి షా).
బద్రుకి తండ్రి ఉండడు. తల్లి ఆమెను పెంచి పెద్ద చేస్తుంది. అయితే హంజ కష్టపడి చదవి.. టీసీ ఉద్యోగం సంపాదిస్తాడు. అయినప్పటికీ.. వీరి బద్రు తల్లి అంగీకరించకపోవడంతో వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అమ్మ ఉండే అపార్ట్ మెంట్‌లో ఈ జంట కూడా అద్దెకు దిగుతుంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగిపోతుంది. ఈ క్రమంలో హంజ మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో ప్రతి విషయంలోనూ భార్యపై చేయి చేసుకుంటూ ఉంటాడు. రాత్రి తాగి వచ్చి కొట్టి. .పొద్దున్న క్షమాపణలు చెబుతూ ఉంటాడు. ఇది షరా మూమూలుగా జరిగిపోతూ ఉంటుంది. ఈ విషయం తల్లికి తెలిసి.. ఎన్ని రోజులు భర్తను భరిస్తావ్.. నా దగ్గరకు వచ్చి ఉండిపో అని చెబుతూ ఉంటుంది. అయినా ఒప్పుకోదు బద్రు. అతడితో తాగుడు మాన్పితే సంసారం బాగుంటుందని భావిస్తుంది.
అంతలో ప్లాన్ వేయగా..అది బెడిసి కొడుతుంది. మళ్లీ ఆమెను కొడతాడు. ఇలా కాదూ.. తమకు ఓ బిడ్డ జన్మిస్తే.. తాగుడు మానేస్తాడని అనుకుంటుంది భార్య. అతడి ముందు అందంగా కనిపించేందుకు రక రకాల మోడ్రన్ డ్రెస్సులు కొంటుంది. ఇది తెలిసి.. బద్రును గాయపరుస్తాడు. ఇది చూసిన..జుల్ఫీ(రోహన్ మాధ్యూ) అతడికి బుద్ది చెప్పాలని అనుకుంటాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ విషయం బద్రుకి తెలియదు. దీంతో బద్రుని, హంజను పిలిపించి వార్నింగ్ ఇస్తారు పోలీసులు. ఈ విషయంపై డిస్కషన్‌లో అత్తపై చేయిచేసుకుంటాడు అల్లుడు. దీంతో నేను కావాలో అతడు కావాలో తేల్చుకోమని చెబుతుంది షంషు..అయినా భర్తను వదిలిపెట్టదు బద్రు. చివరకి ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అంతలో హంజ కూడా మందు మానేస్తాడు. కానీ తనపై కేసు పెట్టిందో ఎవరో తెలుసుకుని భార్యపై ఫైర్ అవుతాడు.. ఆ క్రమంలో ఆమెను ఇంట్లో నుండి తోసేయడంతో మిస్ క్యారేజ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి. ఈ మూవీ చివరిలో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది.. చూసి ఎలా ఉందో చెప్పండి.