వరల్డ్ వైడ్‌గా OTTలో దూసుకెళుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. చూశారా?

రియాలిటీ స్టోరీస్ ను సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల వచ్చిన అటువంటి వాస్తవిక స్టోరీనే.. ద ఇంద్రాణీ ముఖర్జీయా స్టోరీ.. బర్రీడ్ ట్రూత్.

రియాలిటీ స్టోరీస్ ను సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల వచ్చిన అటువంటి వాస్తవిక స్టోరీనే.. ద ఇంద్రాణీ ముఖర్జీయా స్టోరీ.. బర్రీడ్ ట్రూత్.

వాస్తవంగా జరిగిన క్రైమ్ కథలను డాక్యుమెంటరీ లేదా సినిమా రూపాల్లో తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. అటువంటి రియాలిటీ స్టోరీనే..షీనా బోరా హత్య కేసు. దేశాన్ని కుదిపేసిన  రియాలిటీ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మిం ‘ద ఇంద్రాణీ ముఖర్జీయా స్టోరీ.. బర్రీడ్ ట్రూత్’. ఫిబ్రవరి 29 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలకు ముందు ఈ డాక్యుమెంటరీ నిలిపివేయాలంటూ కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో బాంబే హైకోర్టుకు చేరింది. అధికారులు స్క్రీనింగ్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. 2012లో షీనా బోరా హత్యకు గురి కాగా, ఆ విషయం మూడేళ్లకు బయటపడింది. 2015లో షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది.

2015లో ఇంద్రాణీని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తోంది. షీనా బోరా హత్య కేసులో ఆమె సవితి తండ్రి సంజీవ్ ఖన్నా, డ్రైవర్‌తో సహా పలువురు పోలీసులు అదుపులో ఉన్నారు. షీనా 2022లో బెయిల్ రావడంతో ప్రస్తుతం ఆమె బయటే ఉన్నారు. ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీ అభ్యంతరం వ్యక్తం చేసింది సీబీఐ. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం ఇండియాలోనే కాదూ.. 18 దేశాల్లో ప్రేక్షకులు దీన్ని ఆదరించడం విశేషం. కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని బాగా వాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

ఇప్పటి వరకు ద ఇంద్రాణీ ముఖర్జీయా స్టోరీ.. బర్రీడ్ ట్రూత్‌ను 2.2 మిలియన్స్ మందికి పైగా చూశారు. చాలా తక్కువ వ్యవధిలోన మిలియన్స్ వ్యూస్ రాబట్టుకోవడం మామూలు విషయం కాదు. 6.9 మిలియన్ వాచ్ అవర్స్ దక్కించుకుంది ఈ డాక్యుమెంటరీ సిరీస్. సాధారణంగా రియల్ లైఫ్ మించి.. సినిమాల్లో ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కిల్లింగ్ స్టోరీ..అదిరిపోయే ట్విస్టులు ఉండటంతో విశేషణ ఆదరణ పొందుతుంది. కోర్టు కేసుల వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ.. క్రైమ్ స్టోరీకీ క్రేజ్ మామూలుగా ఉండదని నిరూపించారు మూవీ లవర్స్. ఇక మహా శివరాత్రి సందర్భంగా ఓ క్లాసికల్ డ్యాన్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇంద్రాణీ.

Show comments