OTTలోకి సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ooru Peru Bhairavakona OTT Release: సందీప్ కిషన్- వర్షా బొల్లమ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Ooru Peru Bhairavakona OTT Release: సందీప్ కిషన్- వర్షా బొల్లమ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళ్ ఫ్యాన్స్ కు కూడా పరిచయం చైయాల్సిన అవసరం లేదు. కెరీర్ లో హీరోగానే కాకుండా.. క్యామియోలు, మల్టీస్టారర్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రివ్యూలు, టాక్ తో సంబంధం లేకుండా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత మౌత్ టాక్ తో హిట్టుగా మారిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోయింది. మరి.. ఏ ప్లాట్ ఫామ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

ఊరు పేరు భైరవకోన మూవీలో సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మంచి పాజిటివ్ టాక్ తో మూవీ హిట్టుగా మారిపోయింది. రిలీజ్ అయిన 10 రోజుల్లో రూ.25.11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మూవీని చాలామంది థియేటర్ లో చూడలేదు. టాక్ మారిన తర్వాత ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూపులు స్టార్ట్ చేశారు.

ఇప్పుడు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ ప్లాట్ ఫామ్ లోనే ఊరు పేరు భైరవకోన మూవీ స్ట్రీమింగ్ అవుతుందని చెబుతున్నారు. అది మరేదో కాదు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుంది అని టాక్ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ నాలుగు వారాలు గడిచిన తర్వాత ఓటీటీలోకి ఎంటర్ అవుతుంది అంటున్నారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కూడా జీ5 ప్లాట్ ఫామ్ లోనే స్ట్రీమింగ్ కానుంది.

కథ ఏంటంటే?:

భూమి(వర్షా బొల్లమ్మ) కోసం బసవ(సందీప్ కిషన్) దొంగగా మారతాడు. బసవ, అతని స్నేహితుడు జాన్(వైవా హర్ష) కలిసి బంగారం దొంగిలిస్తారు. వాళ్లు తెలియక భైరవకోన ఊరులోకి అడుగు పెడతారు. వారితో పాటుగా గీత(కావ్య థాపర్) కూడా ఆ ఊరుకు వెళ్తుంది. అక్కడ వాళ్లకు అన్నీ విచిత్రంగానే అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సంఘటనలు కాస్త భయానకంగా కూడా ఉంటాయి. అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంటే.. బసవ బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. దానిని తిరిగి పొందడం కుదరదు. అసలు బసవ ఎందుకు దొంగగా మారాడు? ఆ ఊర్లో ఎందుకు అన్నీ విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. అసలు గరుడ పురాణంలో మిస్ అయిన పేజీల్లో భైరవకోన గురించి ఏముంది? అనేదే సినిమా కథ. మరి.. ఊరు పేరు భైరవకోన ఓటీటీలోకి వస్తోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments