Venkateswarlu
మూవీ థియేటర్లలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఓటీటీలోకి రావటం గమనార్హం. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో తక్కువ టైంలోనే తీసేశారు.
మూవీ థియేటర్లలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఓటీటీలోకి రావటం గమనార్హం. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో తక్కువ టైంలోనే తీసేశారు.
Venkateswarlu
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆకాష్ ‘సర్కారు నౌకరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ జనవరి 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో ఆకాష్‌కు జంటగా భావన హీరోయిన్‌గా నటించింది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాణ బాధ్యతులు చేపట్టారు. సర్కారు నౌకరి సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.
రివ్యూవర్లు సైతం మంచి రివ్యూలు ఇచ్చారు. మూవీకి మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనికి తోడు సంక్రాంతి దగ్గరపడటంతో స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నౌకరీని థియేటర్లలోంచి తొందరగానే తీసేశారు. ఇక, ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. జనవరి 12 అంటే.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంది. థియేటర్లలో రిలీజైన దాదాపు 10 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ రావటం గమనార్హం.
ఇంతకీ సర్కారు నౌకరి సినిమా కథ ఏంటంటే..
గోపాల్ ( ఆకాశ్ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పటినుంచి కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. గోపాల్‌ది గవర్నమెంట్ ఉద్యోగం కావటంతో సత్య ( భావన) అనే అమ్మాయి అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడికి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ మీద మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగి కావటంతో అందరూ అతడికి గౌరవం ఇస్తూ ఉంటారు. 199లో ఎయిడ్స్ ప్రభలంగా ఉండేది. దీంతో పై అధికారులు గోపాల్‌కు ఊర్లో కండోమ్స్ పంచే పని అప్పగిస్తారు.
ఆ పని కారణంగా అతడి జీవితంలో పెను మార్పులు వస్తాయి. ఊరి వాళ్లందరూ అతడ్ని బుగ్గలోడు అని పిలుస్తారు. ఊరినుంచి వెళ్లగొట్టాలని కూడా చూస్తారు. దీంతో భార్య చాలా బాధపడుతుంది. ఉద్యోగం మానేసి వేరే ఊరికి వెళ్లి పోదామని అంటుంది. గోపాల్ మాత్రం ఉద్యోగం మానేయనంటాడు. ఇద్దరికీ గొడవ అవుతుంది. ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంది. తర్వాత ఏం జరిగింది? కొల్లాపూర్‌కు అతడికి ఉన్న సంబంధం ఏంటి అన్నదే మిగిలిన కథ. మరి, సర్కారు నౌకరి 10 రోజులకే ఓటీటీలోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.