OTTలోకి రాజ్​తరుణ్-మాల్వీ మల్హోత్రా ‘తిరగబడరా సామి’.. స్ట్రీమింగ్ అందులోనే!

Thiragabadara Saami Movie OTT Streaming Date Fixed: ప్రముఖ హీరో రాజ్​తరుణ్ నటించిన యాక్షన్ లవ్​స్టోరీ ఫిల్మ్ ‘తిరగబడరా సామి’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయింది. ఆ మూవీ ఏ ప్లాట్​ఫామ్​లో అందుబాటులోకి రానుందో ఇప్పుడు చూద్దాం..

Thiragabadara Saami Movie OTT Streaming Date Fixed: ప్రముఖ హీరో రాజ్​తరుణ్ నటించిన యాక్షన్ లవ్​స్టోరీ ఫిల్మ్ ‘తిరగబడరా సామి’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయింది. ఆ మూవీ ఏ ప్లాట్​ఫామ్​లో అందుబాటులోకి రానుందో ఇప్పుడు చూద్దాం..

ఇండస్ట్రీలో హీరో అవడం ఒక ఎత్తయితే.. క్రేజ్, స్టార్ స్టేటస్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. పెద్ద హీరోల సంగతి అటుంచితే.. చిన్న హీరోలకు ఇది మరింత టఫ్ జాబ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్లు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి ఇక్కడ క్రేజ్ సంపాదించడం చాలా కష్టం. దాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్​ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ పోతే గానీ ఎక్కువ కాలం కెరీర్​ను పొడిగించుకోలేరు. అలా కేర్​ తీసుకొని ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న చిన్న హీరోల్లో రాజ్​ తరుణ్ ఒకరు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్ చేస్తూ వాళ్ల మనసుల్లో స్థానం దక్కించుకున్నారీ యంగ్ హీరో. ఇటీవల వరుస సినిమాలతో బాక్సాఫీస్​ వద్దకు వస్తున్నారు రాజ్ తరుణ్. అందులో ఆయన నుంచి వచ్చిన ఓ ఫిల్మే ‘తిరగబడరా సామి’.

సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ‘తిరగబడరా సామి’ మూవీ ఆగస్టు 2న థియేటర్లలోకి వ్చింది. యాక్షన్ లవ్​స్టోరీగా దీన్ని తెరకెక్కించారు రవికుమార్. స్టోరీ విషయానికొస్తే.. గిరి (రాజ్ తరుణ్) చిన్నప్పుడే పేరెంట్స్​కు దూరమవుతాడు. అయితే తనలా ఎవరూ అనాథలా మిగిలిపోకూడదని అనుకుంటాడు. తప్పిపోయిన వాళ్లను వెతికిపెట్టి వాళ్ల ఫ్యామిలీస్ దగ్గరకు చేరుస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడి మంచి మనసు చూసి శైలజ (మాల్వీ మల్హోత్రా) అతడ్ని ప్రేమిస్తుంది. గిరి కూడా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెను కొండారెడ్డి (మకరంద్ దేశ్​పాండే) అనే రౌడీ కిడ్నాప్ చేస్తాడు. ప్రతి దానికీ భయపడే గిరి తన భార్యను రౌడీల బారి నుంచి ఎలా కాపాడాడు అనేది మిగతా కథ. ఈ మూవీ ఆహా ఓటీటీలోకి రానుంది. దీన్ని ఆ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

‘తిరగబడరా సామి’ తమ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్​కు వస్తోందని స్వయంగా ఆహా ఓటీటీ అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చింది. అయితే సరిగ్గా ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందో మాత్రం చెప్పలేదు. కానీ సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని వినిపిస్తోంది. అయితే ఆహా నుంచి దీనిపై కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. ఇక, ఆ మధ్య సినిమాలు తగ్గించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచారు. టాప్​ గేర్​లో దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెలలోనే మూడు మూవీస్​తో ఆడియెన్స్​ను పలకరించారాన. ‘తిరగబడరా సామి’తో పాటు ‘పురుషోత్తముడు’, ‘భలే ఉన్నాడే’ ఫిల్మ్స్​తో బిగ్ స్క్రీన్స్​లో సందడి చేశారు. ఈ శుక్రవారం విడుదలైన ‘భలే ఉన్నాడే’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు మారుతి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివవర్దన్ సాయి తెరకెక్కించారు. మరి.. ‘తిరగబడరా సామి’ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments