ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేసిన మూవీ.. OTTలోకి వచ్చేస్తోంది

కొన్ని సినిమాలు థియేటర్లలో అలరించకపోవచ్చు కానీ టీవీల్లో మంచి వ్యూస్ రాబడుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాయి. అక్కడ కూడా మంచి రేటింగ్ వస్తుంది కొన్ని చిత్రాలు. థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో..

కొన్ని సినిమాలు థియేటర్లలో అలరించకపోవచ్చు కానీ టీవీల్లో మంచి వ్యూస్ రాబడుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాయి. అక్కడ కూడా మంచి రేటింగ్ వస్తుంది కొన్ని చిత్రాలు. థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో..

ఇప్పుడంతా ఓటీటీ మూవీలదే హవా. థియేటర్లతో విడుదలైన నెల రోజుల లోపే ఈ ప్లాట్ ఫామ్స్‌లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. బాక్సాఫీసు వద్ద మిస్ అయిన వాళ్లంతా.. ఓటీటీలో మూవీలను ఆస్వాదిస్తున్నారు. అలా అనేక సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కొన్ని మంచి సినిమాలు కూడా.. థియేటర్లలో అలరించకపోయినా.. ఓటీటీలో అదరగొడుతున్నాయి. చిన్న సినిమాలు సైతం మంచి వ్యూస్ రాబట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిందే కూడా తెలియదు. కానీ కొన్ని నెలల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

ప్రభాస్ ట్రైలర్ విడుదల చేసిన సాచి మూవీ ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సాచీ  మూవీ గత ఏడాది మార్చిలో విడుదలైంది. ఈ మూవీ వచ్చినట్లు కానీ పోయినట్లు కూడా తెలియదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ సినిమా భారత్‌లో తప్పితే.. మిగతా దేశాల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇక్కడ వాళ్లు చూసేందుకు సిద్ధమౌతుంది. అమెజాన్ ప్రైమ్‌లో తర్వలోనే స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది. ఓ కూతురు తన తండ్రి బాధ్యతను తీసుకోవడమే ఈ మూవీ కథ.

బార్బర్ షాప్ నడుపుకునే ఓ తండ్రికి ముగ్గురు కూతుళ్లు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అతడి మీదే ఆధారపడి జీవిస్తుంది అతడి కుటుంబం. అనుకోని విధంగా తండ్రి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడతాడు. అలాంటి సమయంలో తండ్రి కుటుంబ బాధ్యతలను తన మీదకు ఎత్తుకుంటుంది కూతురు సాచి. ఉద్యోగానికి బయటకు వెళ్లిన ఆడ పిల్ల తాను ఎదుర్కొన్న సమస్యలు ఈ మూవీలో చూపించారు. సంజన, గీతికా, అశోక్ రెడ్డి మూల విరాట్, టివి రామన్, ఏవీఎస్ ప్రదీప్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ చిత్ర ట్రైలర్‍ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ మూవీకి దర్శకుడు, నిర్మాత వివేక్ పోతగోని. కెవీ భరద్వాజ్ సంగీతం అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఓటీటీలో రాగానే.. చూసేయండిక..

Show comments