త్రిభువన్ మిశ్రా CA టాపర్.. వెబ్ సిరీస్ రివ్యూ!

Tribhuvan Mishra CA Topper Series Review And Rating: నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ అనే సిరీస్ గురించి బాగానే చర్చ జరుగుతోంది. అంతగా జరిగేలా ఆ సిరీస్ లో ఏముందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

Tribhuvan Mishra CA Topper Series Review And Rating: నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ అనే సిరీస్ గురించి బాగానే చర్చ జరుగుతోంది. అంతగా జరిగేలా ఆ సిరీస్ లో ఏముందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు వెబ్ సిరీస్లకు బాగా అలవాటు పడ్డారు. అందుకు ఒక ప్రధాన కారణం మీర్జాపూర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ మీర్జాపూర్ మేకర్స్ నుంచి మరో అద్భుతమైన వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది కూడా. ఆ వెబ్ సీరీస్ మరేదో కాదు.. త్రిభువన్ సీఏ టాపర్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఈ సిరీస్ కథ ఏంటి? ఎందుకు అంత బాగా వైరల్ అవుతోంది? మీర్జాపూర్ తరహాలో ఇంది కూడా అకట్టుకుంటుందా? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే మీరు ఈ రివ్యూ చూసేయండి.

కథ:

త్రిభువన్(మానవ్ కౌల్) సీఏ టాపర్. అతను నోయిడాలో జీవిస్తూ ఉంటాడు. అతను టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్లో ఒక అప్రూవల్ సెక్షన్ లో పనిచేస్తూ ఉంటాడు. అవకాశం ఉన్నా కూడా లంచం తీసుకోడు. అన్నీ అనుమతులు సరిగ్గా ఉంటేనే ఫైల్ మీద సంతకం పెడతాడు. అతడి నిజాయితీకి చుట్టుపక్కల వాళ్లు పెట్టిన పేరు ‘బతకడం చేతకాని సన్నాసి’. అతనికి వచ్చిన జీతంతోనే కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడు. అతనికి తల్లి అంటే గౌరవం.. భార్యా పిల్లలు అంటే ప్రేమ అమితంగా ఉంటాయి. అయితే త్రిభువన్ కు ఒక పెద్ద కష్టం వస్తుంది. అతని సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ ని ఫ్రీజ్ చేస్తారు. అతనికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అప్పుడు కూడా డబ్బుకోసం తప్పుడు ఫైల్స్ మీద సంతకం పెట్టడు. తాను ‘మగ వే*శ్య’లా మారతాడు. అప్పుడు డబ్బు బాగానే వస్తుంది. కానీ, కష్టాలు కూడా అలాగే కట్టకట్టుకుని వస్తాయి. అసలు త్రిభున్ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది? అతను ప్రారంభించిన పని వల్ల అతనికి ఎలాంటి కష్టం వచ్చింది? అనేది మాత్రం మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా గంట నిడివి కలిగి ఉంటుంది. సిరీస్ లో కంటెంట్ లేకపోతే అంతసేపు ఆడియన్ నిలబడే ప్రసక్తే ఉండదు. కానీ, ఈ సిరీస్ ని మాత్రం ఆపకుండా చూసేస్తారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత రసవత్తరంగా ఉంటుంది. మగ వే*శ్యగా మారిన త్రిభువన్ మిశ్రాకు ఒక స్వీట్ షాప్ ఓనర్ భార్యతో పరిచయం చేస్తారు. అయితే అతను కేవలం స్వీట్ షాప్ ఓనర్ కాదు. అతను ఒక దాదా. అతని భార్యకు సినిమా పిచ్చి.. తన భర్త కూడా హీరోలా స్టెప్పులెయ్యాలి అనుకుంటుంది. కానీ, అది ఆ పెద్దాయనకు నచ్చదు. అందుకే బిందీ.. త్రిభువన్ మిశ్రా సర్వీసెస్ బుక్ చేసుకుంటుంది. అతనితో హోటల్ లో తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తుంది. కానీ, ఆ విషయం తన భర్తకు తెలుస్తుంది. అలా సిరీస్ లో చాలా నరాలు తెగే ఉత్కంఠను పంచే సీన్స్ ఉంటాయి.

ఈ సిరీస్ ని ముందుకు నడింపించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీతం మీద బతికే వాళ్లకు ఆర్థిక కష్టాలు వస్తే.. ఎన్ని ఇబ్బందుల పడాల్సి వస్తుంది అనేది మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే త్రిభువన్ లాంటి వ్యక్తిని చివరకు హంతకుడిగా కూడా మారుస్తారు. అలాంటి హై ఇచ్చే సీన్స్ ఇందులో చాలానే ఉంటాయి. మరోవైపు త్రిభువన్ తప్పుడు ఫైల్స్ మీద కూడా సంతకాలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. అది చూసిన అత్తకు త్రిభువన్ మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. ఆమె కూడా అతడిని వెంబడించడం స్టార్ట్ చేస్తుంది. ఒకవైపు దాదా, మరోవైపు అత్త, ఇంకోవైపు హత్య కేసులో పోలీసులు.. ఇలా త్రిభువన్ ను కష్టాలు కమ్మేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే మీరు ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడలేరు. ఎందుకంటే మగ వే*శ్య అంటే దానికి తగిన సీన్స్ పెట్టాల్సిందే. మొదటి 4 ఎపిసోడ్స్ అవే సీన్స్ ఉంటాయి. అలాగే సిరీస్ మొత్తం కాస్త హార్ష్ ల్యాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూడటం సో బెటర్. కానీ, సిరీస్ మాత్రం నిరాశ పరచదు.

నటీనటులు- టెక్నికల్ పనితీరు:

ఈ సిరీస్ కి ప్రధాన బలం ఆర్టిస్టులు అని చెప్పాలి. ఎందుకంటే అంత మంచి కథను రక్తికట్టించడంలో వాళ్లు బాగా సక్సెస్ అయ్యారు. ఎవరికి వాళ్లు పోటీ పడి మరి నటించారు. లీడ్ రోల్స్ ప్లే చేసిన మానవ్ కౌల్, తిలోత్తమా షోమ్, శ్వేతా బసు ప్రసాద్, పునీత్, రామ్ సంపత్ అంతా అద్భుతంగా నటించారు. వాళ్ల పాత్రలకు జీవం పోశారు. చాలా గ్యాప్ తర్వాత శ్వేతా బసు ప్రసాద్ కూడా తన నటనతో మెప్పించింది. అయితే అక్కడక్కడ మాత్రం కాస్త బూ*తులు చెవుల తుప్పు వదిలిస్తూ ఉంటాయి. మరీ.. మీర్జాపూర్ అంత ఘాటుగా ఉండకపోయినా.. ఒక మాదిరిగా మాత్రం ఉంటాయి. పిల్లలకు మాత్రం అస్సలు చూపించకండి.

ఇంక ఈ కథను సుమిత్ పురోహిత్, కరణ్ వ్యాస్, ఆర్తి రావల్ రాసుకున్న తీరుకే మీరు మంచి మార్కులు వేసేయచ్చు. ఒక నిజాయితీ పరుడిని మగ వే*శ్యగా మార్చాలి అనే వాళ్ల ఆలోచనకే సగం మంది ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇంక స్క్రీన్ ప్లే కూడా మెప్పిస్తుంది. అమ్రిత్ రాజ్ గుప్తా– పునీత్ కృష్ణా డైరెక్షన్ ఆకట్టుకుంటుంది. ఇంక వెబ్ సిరీస్ కాబట్టి నిర్మాణ విలువల్లో ఎలాంటి లోటు పాట్లు కనిపించవు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఛేజింగ్ సీన్స్, పతాక సన్నివేశాల్లో సంగీతం కూడా మెప్పిస్తుంది. అయితే ఇంటిల్లిపాది కలిసి చూసే సిరీస్ మాత్రం కాదు అనే చిన్న ఇబ్బంది ఉంటుంది. అలాగే కాస్త మాటలు కంగారు పెడతాయి. ఈ త్రిభువన్ మిశ్రా సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

బలాలు:

  • లీడ్ యాక్టర్స్
  • కథ, స్క్రీన్ ప్లే
  • ట్విస్టులు

బలహీనతలు:

  • అభ్యంతరకర సన్నివేశాలు
  • బీప్ వేసుకోవాల్సిన మాటలు

చివరిగా: త్రిభువన్ మిశ్రా.. ఎంటర్ టైన్ చేస్తాడు..

రేటింగ్: 3/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments