Krishna Kowshik
Inspector Rishi OTT Review & Rating In Telugu: ఓటీటీలో క్రైమ్, థ్రిల్లర్, హారర్ జోన్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ మూడు జోనర్స్‌తో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అదే ఇన్ స్పెక్టర్ రిషి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?
Inspector Rishi OTT Review & Rating In Telugu: ఓటీటీలో క్రైమ్, థ్రిల్లర్, హారర్ జోన్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ మూడు జోనర్స్‌తో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అదే ఇన్ స్పెక్టర్ రిషి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?
Krishna Kowshik
ప్రతి వీక్ ఓటీటీ లవర్స్‌కు పండుగే. ఈ నెల రోజుల్లో థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. కేవలం తెలుగు సినిమాలో కాకుండా డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చేస్తుంటాయి. అయితే వీక్షకులు ఎక్కువ ఇష్టపడేది మాత్రం క్రైమ్, హారర్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లను మాత్రమే. వీటికి ఓటీటీలో దక్కుతున్న ఆదరణ ప్రత్యేకం. ఈ జోనర్ చిత్రాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మూడు కలిపి ఓ వెబ్ సిరీస్ వస్తే ఇక కుర్చీలో కూర్చొంటామా..స్టార్ చేసి పూర్తి చేయకుండా నిద్ర పడుతుందా..? వాట్ నెక్ట్స్ అన్న మైండ్ థింక్ చేయదా..? అలాంటి ఓ వెబ్ సిరీస్సే ఇప్పుడు ఓటీటీలో విపరీతమైన రివ్యూస్ రాబట్టుకుంటుంది. అదే ఇన్ స్పెక్టర్ రిషి. మార్చి 29 నుండి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ విపరీతంగా వ్యూస్ రాబట్టుకుంటుంది.
కోయంబత్తూరుకు 50 కిలోమీటర్ల దూరంలో తేన్ కాడ్ అనే ఫారెస్టు ఉంటుంది. అది దట్టమైన అడవి. ఆ ఫారెస్టును ఆసరాగా చేసుకుని ఓ తండా ప్రజలు జీవిస్తుంటారు. ఓ రోజు రాత్రి రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ అడవిలో ఒంటరిగా నడుస్తుండగా ఏదో విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. తెల్లారే సరికి.. ఆ అడవిలో రాబర్ట్ డెడ్ బాడీ వేలాడుతూ ఉంటుంది. ఆ మృతదేహానికి సాలీడు గూడు కట్టేసి ఉంటుంది. ఈ కేసును చేధించడానికి వస్తాడు రిషి (నవీన్ చంద్ర). విచారణలో గతంలో ఓ లారీ డ్రైవర్ ఇలానే చనిపోయాయని తెలుస్తుంది, కాంట్రాక్టర్, టీ ఫ్యాక్టరీ యజమాని, మల్లిక ఇలా వరుసగా హత్యలకు గురౌతుంటారు. అంతలో ఆ ఫారెస్టులో విధులు నిర్వహిస్తున్న ఖ్యాతికి (సునైనా), ఆమె స్నేహితురాలు ఓ విచిత్ర ఆకారం చూసినట్లు చెబుతుంది. అయితే ఊరంతా వనరాచి దేవత ఇదంతా చేస్తుందని చెబుతుంటారు. అదే సమయంలో రిషి కూడా తన ప్రియురాలు విజ్జి ఆత్మ కనబడుతూ ఉంటుంది. మరీ ఇన్ని ట్విస్టుల మధ్య ఈ కేసులను రిషి చేధించాడా.. ఆ వనరాచి ఎవరు..అనేది మిగిలిన కథ.
మొత్తం ఈ కథ అంతా ఈ అడవి చుట్టూనే తిరుగుతోంది. క్రైమ్ అండ్ థ్రిల్లర్, మిస్టరీ జోనర్‌తో తెరకెక్కడంతో ఆసాంతం టెన్షన్ పుట్టిస్తోంది. ఎక్కడా బోర్ కొట్టని విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇలాంటి వెబ్ సిరీస్ బ్రెయిన్‌కు అందకుండా ఉండాలి. అప్పుడే సక్సెస్ అయినట్లే. ఈ విషయంలో మాత్రం దర్శకుడు సక్సెస్ కొట్టాడనే చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఈ హత్యలను నిజంగా దెయ్యం చేస్తుందా.. దేవత చేస్తుందా లేక మరెవ్వరైనా చేస్తున్నారా అన్న సందేహం కలిగించక మానదు. ఇక చివరిలో రివీల్ చేసిన ట్విస్టు అయితే ఎవ్వరూ ఊహించలేరు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది తెరపై చూడాల్సిందే.
ఇక ఇందులో నవీన్ చంద్ర నటనతో ఆకట్టుకున్నాడు. అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు నవీన్ చంద్ర. అంతకు ముందు వచ్చిన అమ్ముతో పాటు రిపీట్ వంటి చిత్రాల్లో కూడా పోలీసాఫీసర్ పాత్రలో మెరిశాడు. ఇక హీరోయిన్ సునైనా ఫారెస్టు గార్డుగా సహజమైన నటనతో కట్టిపడేసింది. మిగిలిన పాత్రలు తమకు ఇచ్చిన పాత్ర మేరకు నటించాయి. చివరకు వరకు ప్రేక్షకుల ఊహకు అందకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తూ దర్శకుడు ఓ మంచి హారర్ క్రైమ్ థ్రిల్లర్ అందించడంలో సఫలీకృతుడయ్యాడు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. ఫారెస్ట్ లోకేషన్లు చాలా బాగున్నాయి.