Krishna Kowshik
Guruvayoor Ambalanadayil Movie Review.. సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాలీవుడ్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్. తాజాగా ఆయన నటించిన సినిమా గురువాయిర్ అంబలనడయిల్. ఇందులో సరికొత్త పృథ్వీని చూస్తారు.. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే
Guruvayoor Ambalanadayil Movie Review.. సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాలీవుడ్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్. తాజాగా ఆయన నటించిన సినిమా గురువాయిర్ అంబలనడయిల్. ఇందులో సరికొత్త పృథ్వీని చూస్తారు.. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే
Krishna Kowshik
ఈ ఆరు నెలల కాలంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకున్నాడు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్. గత ఏడాది చివరిలో రిలీజైన సలార్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రభాస్ స్నేహితుడిగా వరదరాజ్ మన్నార్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు పృథ్వీ. ఒకటి హిందీ మూవీ కాగా, రెండు మలయాళ చిత్రాలు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసును షేక్ చేసేశాయి. మార్చిలో గోట్ లైఫ్-ఆడు జీవితం మూవీతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. మేలో మరో మూవీ రిలీజ్ చేయగా.. ఇది కూడా వంద కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది. అదే గురువాయిర్ అంబలనడయిల్. మే 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. సలార్, గోట్ లైఫ్ చిత్రాల్లో సీరియస్ క్యారెక్టర్ చేసిన పృథ్వీని ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ చదివేయండి.
కథ
గురువాయిర్ ప్రాంతానికి చెందిన విను రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్)దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అతడికి ఆనంద్ (పృధ్వీ రాజ్ సుకుమారన్) సోదరి అంజలి (అనేశ్వర రాజన్)తో వివాహం కుదురుతుంది. విను గతంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె మరొకర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంజలి సంబంధం వస్తుంది. ఈ క్రమంలో నిత్యం బావ ఆనంద్‌తో టచ్‌లో ఉంటూ.. తన బాధను పంచుకుంటూ ఉంటాడు విను. ఆనంద్‌కు చాలా కోపం ఎక్కువ. కానీ విను పరిచయం అయిన తర్వాత మారుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆనంద్.. తన భార్య పార్వతి (నిఖిలా విమల్)కి దూరంగా ఉన్నాడని తెలుసుకుంటాడు విను. భార్యతో కలిసిపోవాలని విను సలహా ఇవ్వడంతో భార్య వద్దకు వెళ్లి కాంప్రమైజ్ అవుదామని ఆనంద్ చెప్పడంతో కలిసిపోతారు. ఇంతలో పెళ్లి కోసం దుబాయ్ నుండి ఇండియాకు వస్తాడు విను. ఆనంద్‌ను కలిసేందుకు వెళ్లగా.. అసలు విషయం తెలుస్తుంది. ఆనంద్ పెళ్లి చేసుకున్నది ఎవరు కాదో.. తన మాజీ ప్రేయసిని అని తెలుసుకుంటాడు. దీంతో ఈ పెళ్లి ఆపేందుకు విను పలు ప్రయత్నాలు చేస్తాడు. కానీ సక్సెస్ కావు. అంతలో ఆనంద్‌కు కూడా తన భార్య పార్వతి.. విను మాజీ ప్రేయసి అని తెలిసిపోతుంది. ఈ క్రమంలో ఆనంద్ కూడా పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ఎవరూ నమ్మరు. విను, పార్వతి ఎందుకు విడిపోయారు. మరీ ఈ పెళ్లి జరిగిందా.. లేదా తెలియాలంటే? ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
గురువాయిర్ ప్రాంతంలో పెళ్లి చుట్టూనే కథ నడుస్తుంది. ఇది ఓ కామెడీ మూవీ. చిన్న కథతో మ్యాజిక్ చేయడంలో మాలీవుడ్ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇది కూడా అలాంటి స్టోరీనే. జయ జయ జయ జయ హేతో మెప్పించిన విపిన్ దాస్ మరోసారి విభిన్నమైన స్టోరీని తెరకెక్కించాడు. సినిమా అంతా నవ్వులు, పువ్వులు పూయిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. కథను రివీల్ చేస్తూనే.. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఫన్ పండించాడు. అక్కడక్కడ వచ్చే ట్విస్ట్ హెలెట్ అసలు. ఈ తరహా కామెడీ ఈ మధ్యలో రాలేదని చెప్పాలి. సినిమా ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఉంటుంది. తొలుత బెస్ట్ ఫ్రెండ్స్ గా కనిపించే విను, ఆనంద్ క్యారెక్టర్స్.. సెకండాఫ్ వచ్చేసరికి టామ్ అండ్ జెర్రీల్లా మారిపోతుంటారు. కథనం కాస్తంత నెమ్మదిగా అనిపించినప్పటికీ.. కామెడీ కవర్ చేసేస్తుంది. ఒక్క సీన్ కూడా అంబారిసింగ్ అనిపించదు.
ఎవరెలా చేశారంటే..
పృధ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియస్ క్యారెక్టర్ మాత్రమే కాదు.. కామెడీ సీన్లలో కూడా అదరగొట్టాడు. సలార్, ఆడు జీవితం వంటి చిత్రాల్లో సీరియస్ లుక్స్‌లో కనిపించిన పృధ్వీ.. ఇందులో భిన్నంగా కనిపిస్తాడు. నిజంగా అతడు మెథడ్ యాక్టర్. ఇక బాసిల్ కూడా బాగా యాక్ట్ చేశాడు. జయ జయ జయ హే సినిమా చూసిన వాళ్లకు అతడి యాక్టింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకో సారి తన క్యూట్ నటనతో కట్టిపడేశాడు. పృధ్వీ, బాసిల్ మధ్య సీన్స్ కితకితలు పెడుతుంటాయి. ఇక నేరు చిత్రంలో అంధురాలిగా నటించిన అనేశ్వర రాజన్.. ఇందులో అంజలి పాత్రలో మెప్పించింది. పార్వతి క్యారెక్టర్‌లో నిఖిలా విమల్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇందులో తమిళ కమెడియన్ యోగి బాబు ఉన్నది కాసేపే అయినా.. నవ్వు తెప్పిస్తాడు. ఇక సీన్స్ అన్నీ నీట్‌గా ఉంటాయి. కెమెరా పనితనం బాగుంది. అలాగే మ్యూజిక్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. మోహన్ బాబు, శిల్పా శెట్టి నటించిన వీడెక్కడి మొగుడండి బాబులో ఔరా లైలా మూవీ బిట్ ఇందులో వినిపిస్తుంది.
బలాలు
పృధ్వీరాజ్, బాసిల్ నటన
ట్విస్టులు
కామెడీ సీన్స్
బలహీనలు
పాటలు
కాస్తంత సాగదీత
చివరిమాట.. నవ్వుకోవడం పక్కా