Aham Reboot Review & Rating In Telugu: సింగిల్‌ క్యారెక్టర్‌తో వచ్చిన తెలుగు సైకలాజిలక్‌ థ్రిల్లర్‌ అహం రీబూట్‌.. రివ్యూ

Aham Reboot Review: సింగిల్‌ క్యారెక్టర్‌తో వచ్చిన తెలుగు సైకలాజిలక్‌ థ్రిల్లర్‌ అహం రీబూట్‌ రివ్యూ

ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన దగ్గర నుంచి తెలుగులో కూడా కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో.. సింగిల్‌ క్యారెక్టర్‌తో అహం రీబూట్‌ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన దగ్గర నుంచి తెలుగులో కూడా కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో.. సింగిల్‌ క్యారెక్టర్‌తో అహం రీబూట్‌ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

అహం రీబూట్‌

30-06-2024, U
సైకలాజికల్‌ థ్రిల్లర్‌
  • నటినటులు:సుమంత్‌
  • దర్శకత్వం:ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి
  • నిర్మాత:రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు
  • సంగీతం:శ్రీరామ్‌ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ:వరుణ్‌ అంకర్ల

2

సుమంత్‌ హీరోగా.. సింగిల్‌ క్యారెక్టర్‌తో ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా అహం రీబూట్‌. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆహా ఓటీటీలో విడుదలయ్యింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా అంటే..

కథ

నిలయ్‌(సుమంత్‌) ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలనుకుంటాడు. కానీ ఓ యాక్సిడెంట్‌ ఇతడి జీవితాన్ని మార్చేస్తుంది. దాంతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కావల్సిన వ్యక్తి.. రేడియో జాకీగా మారతాడు. ఇక ఇదే యాక్సిడెంట్‌లో నిలయ్‌ కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోతుంది. ఆ బాధతో నిలయ్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తాడు. ఈ ఆలోచనల నుంచి బయటకు రావడం కోసం రేడియో జాకీగా మారతాడు. ఈ క్రమంలో ఓ రోజు నిలయ్‌కు ఓ అమ్మాయి కాల్‌ చేసి తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. ముందు అది ప్రాంక్‌ కాల్‌ అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి చెప్పిన విషయాలతో కన్విన్స్‌ అయ్యి.. వారి మాటలను లైవ్‌లో పెట్టేస్తాడు నిలయ్‌. వీరి మాటలు విన్న పోలీసులు ఆ అమ్మాయి నిజంగానే కిడ్నాప్‌ అయ్యిందని నమ్మి.. కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

అమ్మాయి వివరాలు సేకరించే బాధ్యతను నిలయ్‌కు అప్పగిస్తారు పోలీసులు. ఈ క్రమంలో అసలు ఆ యువతి ఎవరు.. నిజంగానే ఆమె కిడ్నాప్‌ అయ్యిందా.. పోలీసులు ఆమెను ఎలా కాపాడారు.. ఇంతకు నిలయ్‌ వల్ల యాక్సిడెంట్‌లో చనిపోయిన యువతి ఎవరు.. నిజంగానే నిలయ్‌ కారణంగానే ఆమె చనిపోయిందా.. కిడ్నాప్‌ అయ్యానంటూ ఫోన్‌ చేసిన యువతి ఎవరు వంటి వివరాలు తెలియాలంటే.. అహం రీబూట్‌ చూడాల్సిందే.

విశ్లేషణ

ముందు చెప్పినట్లుగానే సినిమా అంతా ఒకే క్యారెక్టర్‌.. ఒకే రూమ్‌లో రేడియో షో బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. సినిమా అంతా సుమంత్‌ పాత్ర ఒక్కటే తెర మీద కనిపిస్తుంది. మిగతా పాత్రల కేవలం వినిపిస్తాయి. నిల‌య్‌ రేడియో షోకు అమ్మాయి కాల్ చేసి తాను కిడ్నాప్‌కు గుర‌య్యాన‌ని చెప్పే సీన్ నుంచి అస‌లు క‌థ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్‌. ఆ తర్వాత కిడ్నాప్‌కు గురైన అమ్మాయి నుంచి నిలయ్‌ సమాచారం సేకరించి పోలీసుల‌కు అందించ‌డం, ఆమెను కాపాడేందుకు పోలీస్ ఆఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాల‌ను ఫోన్ కాల్స్ ద్వారా డైలాగ్స్ రూపంలో వినిపించ‌డం కొత్తగా అనిపిస్తుంది. ఆఖర్లో నిల‌య్ లైఫ్‌కు.. యువతి లింక్ పెడుతూ వ‌చ్చే ట్విస్ట్ బాగుంది. ఆ లింక్ ద్వారా ఓ మ‌ర్డ‌ర్ కేసుకు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేయ‌డం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

సినిమా మొత్తం మనకు తెర మీద కేవలం సుమంత్‌ మాత్రమే కనిపిస్తాడు. మిగతా పాత్రలు కేవలం వినిపిస్తాయి. కాబట్టి సుమంత్‌ యాక్టింగ్‌ గురించి మాత్రమే చెప్పుకోవాలి. కేవలం ఒక్క క్యారెక్టర్‌తో మూవీ చేయడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఒకే చోట ఉంటూ అనేక ఎమోష‌న్స్ పండిస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్ర‌య‌త్నంలో సుమంత్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. లుక్‌ పరంగా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు.

బలాలు

  • సుమంత్‌ యాక్టింగ్‌
  • కథ చెప్పిన విధానం
  • బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

బలహీనతలు

  • సినిమా అంతా ఒకే పాత్ర కనిపించడం

చివరి మాట.. ఓపిగ్గా చూస్తే.. అహరం రీబూట్‌ నచ్చుతుంది

Show comments