ఈ వారం OTT లో ఈ 4 తెలుగు మూవీస్.. ఇవి కానీ మిస్ అయ్యారా !

ప్రతి వారంలానే ఈ వారం కూడా OTT లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎంట్రీ ఇచ్చాయి. కానీ వాటిలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరిఈ సినిమాలను కానీ మిస్ అయ్యారా.. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ప్రతి వారంలానే ఈ వారం కూడా OTT లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎంట్రీ ఇచ్చాయి. కానీ వాటిలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరిఈ సినిమాలను కానీ మిస్ అయ్యారా.. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

కంటెంట్ ని బట్టి మూవీస్ ను చూస్తూ ఉంటారు OTT లవర్స్. కానీ అది తెలుగు సినిమా అయితే మాత్రం అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. అలా ఈ వారం OTT లో కేవలం నాలుగు మాత్రమే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఆల్రెడీ ఓ మూవీ బెస్ట్ అనిపించుకుంటుంది. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి:

ఈ సినిమా మే 16 నుంచి ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కళ్యాణ్ రామ్ , విజయశాంతి కలిసి నటించిన ఈ సినిమాకు OTT లో మంచి మార్కులే పడుతున్నాయి.తల్లీకొడుకుల సెంటిమెంట్‍తో సాగే ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. కాబట్టి థియేటర్ లో ఎవరైనా ఈ సినిమాను మిస్ అయితే OTT లో అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.

అనగనగా :

సుమంత్ నటించిన ఈ సినిమాకు OTT లో సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కుతుంది. ఒకవేళ థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరం పిల్లలకు పెద్దలకు ఎలాంటి కంటెంట్ అవసరమో అదే కంటెంట్ ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా ఈ సినిమాను చూసేయండి.

మరణమాస్ :

మలయాళ సినిమాలకు ఎప్పుడు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇక ఏవ్ మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కు వస్తే మూవీ లవర్స్ అసలు వదిలిపెట్టరు. ఒకవేళ ఈ సినిమాను కానీ మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కామెడీ, క్రైమ్, ట్విస్టులతో ఈ మూవీ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగిపోతూ ఉంటుంది.

గ్యాంగర్స్ :

ఒరిజినల్ గా ఇది తమిళ్ సినిమా. కానీ తమిళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓ మంచి కామిడి మూవీ చూడాలని అనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments