The Goat Life OTT: అఫీషియల్ :ఎట్టకేలకు OTT లోకి ది గోట్ లైఫ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

The Goat Life OTT Streaming Date Fix: థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే ఓటీటీ లోకి సినిమాలు వచ్చేస్తున్నాయి.కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కకెలకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

The Goat Life OTT Streaming Date Fix: థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే ఓటీటీ లోకి సినిమాలు వచ్చేస్తున్నాయి.కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కకెలకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

మలయాళ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు ఏ మ్యాజిక్ చేస్తున్నాయో తెలియదు కానీ, ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు, ఈ క్రేజ్ ను చూస్తున్న మేకర్స్.. వారి సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ.. థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలా గత కొన్ని నెలల్లో బాక్స్ ఆఫీస్ ను ఒక ఊపు ఊపేసిన మలయాళీ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి.. పృద్విరాజ్ సుకుమారన్ నటించిన “ఆడు జీవితం ది గోట్ లైఫ్”. థియేటర్ రిలీజ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత.. ఈ సినిమా ఓటీటీ లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. కానీ అదిగో ఇదిగో అనడమే కానీ ఈ సినిమా వచ్చిందే లేదు. దాదాపు ఈ సినిమాను అందరు మర్చిపోయారనుకునే టైమ్ కి.. ఇప్పుడు మరొక డేట్ ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా.. నెల రోజులలోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. కానీ ఎందుకో కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన టైమ్ కు.. చెప్పిన ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రావు. దీనితో థియేటర్ లో ఆ సినిమాలను మిస్ అయ్యి.. కనీసం ఓటీటీ లో అయినా చూద్దాం అనుకునే ప్రేక్షకులకు నిరాశ ఎదురౌతుంది. ఇప్పటివరకు ఇలా చాలా సార్లు జరిగింది. ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమా విషయంలో కూడా ఇప్పటి వరకు.. చాలానే స్ట్రీమింగ్ డేట్స్ , ప్లాట్ ఫార్మ్స్ వచ్చాయి. అదిగో ఇదిగో అనడమే కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ కు మాత్రం రాలేదు. ఇక దాదాపు ఈ సినిమాపై అందరు ఆశలు వదిలేసుకునే సమయానికి మరొక స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈసారైనా మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందో లేదో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు మేకర్స్. ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ వలస వెళ్లిన.. కేరళ కూలిలా నిజ జీవిత పాత్రను పోషించారు. 1990 లో సౌదీ వెళ్లిన వారు అక్కడ ఎలాంటి బానిసత్వానికి గురయ్యారు. వారు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేదే ఈ సినిమా కథ. అక్కడి వారి కష్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాకు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పృథ్వి రాజ్ సుకుమారన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎంతమందిని ఆకట్టుకుంటుందో.. ఈసారైనా చెప్పిన డేట్ కు వస్తుందో లేదో చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments