P Krishna
Best Horror Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగం సరికొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ పెరుతుగున్నా కొద్ది ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ధియేటర్లో టికెట్ తీసుకొని పడిగాపులు కాస్తూ ఉండే రోజులు పోయాయి.. ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు నెలలోపే రిలీజ్ అవుతున్నాయి.
Best Horror Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగం సరికొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ పెరుతుగున్నా కొద్ది ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ధియేటర్లో టికెట్ తీసుకొని పడిగాపులు కాస్తూ ఉండే రోజులు పోయాయి.. ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు నెలలోపే రిలీజ్ అవుతున్నాయి.
P Krishna
ప్రస్తుతం రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇష్టమైన సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఛాయిస్.. కొంతమందికి ఫ్యామిలీ ఓరియెటంటెడ్ చిత్రాలు అంటే ఇష్టం. మరికొందరికి యాక్షన్, కామెడీ, హర్రర్ జోనర్ లో వచ్చే సినిమాలు అంటే ఇష్టం. చాలా మంది చీకటి అన్నా.. దెయ్యాలు అన్న భయంతో వణికిపోతుంటారు. విచిత్రం ఏంటంటే అలాంటి వారే ఎక్కువగా హర్రర్ చిత్రాలు చూస్తుంటారు. ఓటీటీలో బెస్ట్ హర్రర్ చిత్రాలు ఏంటో అవి ఎక్కువ స్ట్రీమింగ్ అవుతున్నయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
1993లో వచ్చిన ‘మణిచిత్ర తాళు’ ఈ చిత్రం మలయాళంలో వచ్చింది. రజినీకాంత్ నటించిన చంద్రముఖి ఒరిజినల్. అప్పట్లో మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. థియేటర్లో ఆడియన్స్ వణికిపోయేలా చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
2009లో వచ్చిన ‘13బీ’ ఈ మూవీ ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంతా తెరకెక్కించారు. ప్రతి సీన్ భయపెట్టే విధంగా ఉంటుంది. ఈ మూవీ హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
కోడీ రామకృష్ణ దర్శకత్వలో అనుష్క శెట్టి నటించిన ‘అరుంధతి’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బొమ్మాళీ నిన్ను వదలా అంటూ అందరినీ భయపెట్టే సీన్లు థియేటర్లో హడలగొట్టాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
2012లో వచ్చిన ‘పిజ్జా’ విజయ్ సేతు పతికి మంచి స్టార్‌డమ్ తీసుకు వచ్చింది. పిజ్జా డెలివరీ బాయ్ గా ఓ వ్యక్తికి ఎదురయ్యే వింత సంఘటనలు, అనుభవాల కథాంశం అద్భుతంగా చూపించారు. ఈ మూవీ సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
2015లో వచ్చిన ‘డిమాంటో కాలనీ’ బంగ్లాలో జరిగే విచిత్ర ఘటనలు వెన్నుల్లో వణుకు పుట్టించేలా ఉంటాయి. తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
2017 లో సిద్దార్ధ్ నటించిన ‘గృహం’ మూవీ ఒంటరిగా కూర్చొని చూడాలంటే భయం పుట్టేలా ఉంటుంది. ఈ మూవీ జియో సినిమాలో యూట్యూబ్ లో తెలుగులో అందుబాటులో ఉంది.
2018 లో వచ్చిన ‘తుంబాడ్ ’ మూవీ భయంకరంగా ఉంటుంది. అత్యాశ కలిగిన వ్యక్తి జీవితంలో ఎలా నాశనం అవుతాడో అద్భుతంగా చూపించారు.
సెన్సేషన్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కౌన్’ 1999 లో వచ్చింది. డిఫరెంట్ సౌండ్స్, కెమెరా మ్యాజిక్ తో వర్మ భయపెట్టేశాడు. ఈ మూవీ యూట్యూబ్ తెలుగులో అందుబాటులో ఉంది.
2021 లో వచ్చిన హౌజ్ ఆఫ్ సీక్రెట్. ఇది మూడు ఎపిసోడ్స్ గా ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సీరీస్. నిజ జీవితంలో జరిగిన సంఘటనతో తీశారు. తెలుగులో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
2022లో వచ్చిన భూతకాలం ప్రతి ఒక్కరినీ భయపెట్టే విధంగా ఉంటుంది. మాలయాళ సినిమానే కానీ తెలుగులో డబ్బింగ్ చేశారు. ఈ మూవీలో దెయ్యాన్ని ఎక్కడ చూపించరు. ఈ మూవీ సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
2022లో వచ్చిన మసూదా సెన్సేషనల్ హిట్ అయ్యింది. హర్రర్ జోనర్ లో వచ్చినే ఈ చిత్రంలో క్షణ క్షణం ఉత్కంఠంగా భయం పుట్టించే సీన్లు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
2024 లో రిలీజ్ అయిన ‘భ్రమ యుగం’ లో మమ్ముట్టి నటించారు. హర్రర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంట్లో జరిగే కథతో తెరకెక్కించారు. సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.