OTT లోకి వచ్చేసిన తెలుగు హర్రర్ సిరీస్ ‘మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

OTT Telugu Web Series-The Mystery Of Moksha Island : ఈ వారం OTT లో చాలానే సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చితే ఈ వారం తెలుగు సినిమాలు తక్కువే. వాటిలో డైరెక్ట్ గా రిలీజ్ కు వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ను మాత్రం అసలు మిస్ చేయకండి. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Telugu Web Series-The Mystery Of Moksha Island : ఈ వారం OTT లో చాలానే సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చితే ఈ వారం తెలుగు సినిమాలు తక్కువే. వాటిలో డైరెక్ట్ గా రిలీజ్ కు వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ను మాత్రం అసలు మిస్ చేయకండి. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ప్రతి సినిమాను , సిరీస్ ను ప్రేక్షకులు చూస్తారో లేదో తెలియదు కానీ.. తెలుగు సినిమాలను మాత్రం కచ్చితంగా చూస్తారు. ఈ క్రమంలో ఈ వారం ఎలాగూ థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు లేవు కాబట్టి.. ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్షకులు. అయితే గత వారంతో పోలిస్తే.. ఈ వారం ఓటీటీ లో తెలుగు సినిమాలు తక్కువే. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలను ఎలాగూ కొంతమంది చూసే ఉంటారు. కాబట్టి డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఈ తెలుగు హర్రర్ సిరీస్ ను మాత్రం అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్ , మర్డర్ మిస్టరీ సిరీస్ లకు, సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ జోనర్ లో వచ్చే సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కదలనివ్వకుండా చూసేలా చేస్తూ ఉంటాయి. మేకర్స్ కూడా సరికొత్తగా వీటిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాంటిదే ఈ తెలుగు హర్రర్ సిరీస్ కూడా.. ఈ సిరీస్ పేరు ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’. తెలుగులో ఇలాంటి సిరీస్ లు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి హర్రర్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ లో డాక్టర్ విశ్వక్సేన్ అనే వ్యక్తి ఉంటాడు .. అతను ఒక ఐలాండ్ ను సృష్టిస్తాడు. అయితే అతని సంపదకు వారాసులు ఎవరనేది మాత్రం అందరికి ఓ పెద్ద ప్రశ్నగా మారుతుంది. దానికోసం నికోబర్ లో ఉన్న తన ప్రైవేట్ ఐలాండ్ కు అతను తన వారసులందరిని.. ఆహ్వానిస్తాడు. ఇక వారసులు కూడా తమ వాటా కోసం ఆ ఐలాండ్ కు వెళ్తారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వారంతా అనుమానాస్పదంగా మిస్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఆస్తి కోసమే వారిలో ఒకరు ఇలా అందరిని చంపేస్తున్నారనే అనుమానాలు మొదలవుతాయి. అసలు ఆ హత్య చేసింది ఎవరు ? ఆ మోక్ష ఐలాండ్ లో అసలు ఏం జరుగుతుంది ? చివరికి ఆస్తి ఎవరికీ దక్కుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments