Telugu OTT Psychological Thriller : రెండు OTT ల్లోకి వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

రెండు OTT ల్లోకి వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Telugu OTT Psychological Thriller : కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. రెండు మూడు నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లేట్ రిలీజెస్ లిస్ట్ లోకి మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ యాడ్ అయింది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

Telugu OTT Psychological Thriller : కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. రెండు మూడు నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లేట్ రిలీజెస్ లిస్ట్ లోకి మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ యాడ్ అయింది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా.. నెలకో రెండు నెలలకో కచ్చితంగా ఓటీటీ లోకి రావాల్సిందే. కాకపోతే కొన్ని సినిమాలు లేట్ అవుతూ ఉంటాయంతే. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం .. థియేటర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి మూవీ రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇలాంటి సినిమాలన్నీ కూడా త్వరగానే ఓటీటీ లోకి వస్తూ ఉంటాయి. కానీ ఎందుకో ఈ మూవీ మాత్రం ఆలస్యం అయింది. నాలుగు నెలల తర్వాత శబరి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శబరి సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు అనిల్. సాధారణంగా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకులు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. థియేటర్ లో మాత్రం ఈ సినిమా హిట్ టాక్ సంపాదించలేకపోయింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు.. గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌, శ‌శాంక్ ప్రధాన పాత్రలలో నటించారు . ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ తో పాటు.. ఆహా లోను.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సెప్టెంబట్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక శబరి మూవీ కథ విషయానికొస్తే.. వ‌ర‌ల‌క్ష్మి, అర‌వింద్‌ అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆల్రెడీ అరవింద్ లైఫ్ లో మరొక అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకుని.. తన కూతురుతో కలిసి బతకాలని డిసైడ్ అవుతుంది. బ్రతుకు తెరువు కోసం చాలానే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఓ జుంబా ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. మరో వైపు ఆమె కోసం ఓ క్రిమినల్ వెతుకుతూ ఉంటాడు. దీనితో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది . కట్ చేస్తే అతను చనిపోయినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సో వరలక్ష్మి కే ఎదో ప్రాబ్లమ్ ఉందని అనుకుంటారు. అసలు ఆమెను వెంటాడుతున్న క్రిమినల్ ఎవరు ? అరవింద్ లైఫ్ లో ఉన్న మరొక వ్యక్తి ఎవరు ? క్రిమినల్ క్యారెక్టర్ నిజమేనా ? తర్వాత ఏం జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments