OTT లో బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్ మూవీ.. ‘బాలుగాని టాకీస్’ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Telugu Comedy Movie OTT Streaming Date: ఈ మధ్య కాలంలో అయితే తెలుగు కంటెంట్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డైరెక్ట్ గా ఓటీటీ లో తెలుగు సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పైగా ఆ సినిమాలకు , సిరీస్ లకు అదే రేంజ్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది.

Telugu Comedy Movie OTT Streaming Date: ఈ మధ్య కాలంలో అయితే తెలుగు కంటెంట్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డైరెక్ట్ గా ఓటీటీ లో తెలుగు సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పైగా ఆ సినిమాలకు , సిరీస్ లకు అదే రేంజ్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది.

నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. అందులోను కామెడీ మూవీస్ కు డిమాండ్ బాగా పెరుగుతుంది. పైగా వాటిలో తెలుగు కంటెంట్ ఉండే సినిమాలైతే ఇట్టే ఆదరణ లభించేస్తుంది. ఈ క్రమంలో ఎక్కువగా తెలుగు కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాట్ ఫార్మ్స్ ఆహ, ఈటీవీ విన్. అయితే ఇప్పుడు ఓ తెలుగు కామెడీ డ్రామా ‘బాలుగాని టాకీస్’ నేరుగా ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఏంటో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

బాలుగాని టాకీస్ అనే ఈ సినిమాలో.. ర‌ఘు కుంచే, సుధాక‌ర్‌రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి లాంటి నటీ నటులు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు .కాగా ఈ సినిమాకు విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వహించగా శ్రీనిధి సాగ‌ర్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీలో శివ‌రామ‌చంద్ర‌వ‌ర‌పు, శ‌ర‌ణ్య శ‌ర్మ హీరోహీరోయిన్లుగా.. డైరెక్ట్ గా ఆహాలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్నీ తాజాగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షోలో అనౌన్స్ చేశారు. ఈ మధ్య కాలంలో కామెడీ మూవీస్ కు డిమాండ్ బాగా పెరుగుతుంది.. కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పి తీరాల్సిందే.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది ఒక పీరియాడిక్ కామెడీ డ్రామా మూవీగా రాబోతున్నట్లు కనిపిస్తుంది.బాలు అనే అతను పాతకాలం నాటి థియేటర్ ను నడుపుతూ ఉంటాడు. అతను బాలకృష్ణ వీరాభిమాని అవ్వడంతో.. థియేటర్ లో ఎక్కువగా బాలయ్య సినిమాలే వేస్తూ ఉండేవాడు. మరి అదే థియేటర్ ను నమ్ముకున్న బాలు జీవితం ఎలా ముందుకు సాగింది ? అతని థియేటర్ కు పాత కళ వచ్చిందా లేదా ? అనేదే తెరపై చూడాల్సిన కథ. తెలుగులో ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి కాబట్టి.. అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments