Swetha
Sports Drama Aha Movie OTT Streaming Date: ఇప్పుడు ఓటీటీ లలోకి చాలా సినిమాలు వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి . ఈ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి ఎప్పటినుంచో.. రిలీజ్ కాకుండా ఉన్న సినిమాలు కూడా.. ఇపుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోకి రాబోతుంది.
Sports Drama Aha Movie OTT Streaming Date: ఇప్పుడు ఓటీటీ లలోకి చాలా సినిమాలు వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి . ఈ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి ఎప్పటినుంచో.. రిలీజ్ కాకుండా ఉన్న సినిమాలు కూడా.. ఇపుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోకి రాబోతుంది.
Swetha
ఈ వారం ఓటీటీ లో థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలతో పాటు.. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఈ లిస్ట్ లో యాడ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ చూసి.. ఎప్పటినుంచో ఓటీటీ రిలీజ్ కు నోచుకోని సినిమాలను.. ఇప్పుడు ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు, ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి మూడేళ్ళ తర్వాత ఓ మలయాళం సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా.. తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా పేరు… ‘ఆహా’ . 2021 లో మలయాళంలో రిలీజ్ అయినా ఈ సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఈ మూవీని బిబిన్ పాల్ శామ్యూల్ డైరెక్ట్ చేయగా.. ఈ సినిమాలో ఇంద్రజీత్ సుకుమారన్, మనోజ్ జయన్, అమిత్ చకలక్కల్, అశ్విన్ కుమార్, శాంతి బాలచంద్రన్ లాంటి నటి నటులు ప్రధాన పాత్రలో నటించారు. ఇన్ని సంవత్సరాలు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎందుకు రాలేదో తెలియదు. కానీ , రీసెంట్ గానే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ సదరు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి.. ఆట మొదలెట్టాక అటో ఇటో తేలిపోవాల్సిందే.. ఆహా సెప్టెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అసలే మలయాళీ కంటెంట్ కు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. కాబాట్టి ఈ స్పోర్ట్స్ డ్రామా కూడా ప్రేక్షకులను మెప్పించేస్తుంది.
ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా 1980,1990 లలో పాపులర్ టగ్ ఆఫ్ వార్ టీం అయినా.. ఆహా నీలూర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. 15 ఏళ్ళ పాటు ఈ టీం అంతా కూడా టగ్ ఆఫ్ వార్ లో.. తిరుగులేని ఛాంపియన్స్ గా నిలించింది. పగలంతా పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండే టీం సభ్యులంతా.. రాత్రయితే టగ్ ఆఫ్ వార్ గేమ్ లో పార్టిసిపేట్ చేసి స్టార్స్ గా ఎదిగేవారు. స్టోరీ బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి.. ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను కూడా మెప్పించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ వీకెండ్ మస్ట్ వాచ్ లిస్ట్ లో.. ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.