OTT లో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘శేఖర్ హోమ్’.. ఈ వీకెండ్ బెస్ట్ ఛాయస్

OTT Detective WebSeries In Telugu: క్రైమ్ కథలను ప్రతి ఒక్కరు చాల ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇక క్రైమ్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఉంటే.. ఇంకాస్త కిక్ ఉంటుంది. అలాంటిదే డిటెక్టీవ్ క్రైమ్ కథలైతే ఇక ఆ మూవీ, సిరీస్ అయ్యేంత వరకు ప్రేక్షకులు ఎక్కడకి కదలరు. ఇప్పుడు అచ్చం అలాంటి ఓ డిటెక్టీవ్ క్రైమ్ కథ ఓటీటీ లోకి వచ్చేసింది.

OTT Detective WebSeries In Telugu: క్రైమ్ కథలను ప్రతి ఒక్కరు చాల ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇక క్రైమ్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఉంటే.. ఇంకాస్త కిక్ ఉంటుంది. అలాంటిదే డిటెక్టీవ్ క్రైమ్ కథలైతే ఇక ఆ మూవీ, సిరీస్ అయ్యేంత వరకు ప్రేక్షకులు ఎక్కడకి కదలరు. ఇప్పుడు అచ్చం అలాంటి ఓ డిటెక్టీవ్ క్రైమ్ కథ ఓటీటీ లోకి వచ్చేసింది.

షెర్లాక్ హోమ్స్ డిటెక్టీవ్ డ్రామాస్ ప్రపంచం అంతా కూడా ఇవి చాలా ఫేమస్. ఈ కథలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ,సైకో కిల్లర్ కథలైతే వచ్చాయి కానీ.. షెర్లాక్ హోమ్స్ లాంటి డిటెక్టీవ్ క్రైమ్ కథలు మాత్రం రాలేదు. సాధారణంగానే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే.. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. అలాంటిది డిటెక్టీవ్ క్రైమ్ కథలంటే ఎందుకు మిస్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ లోకి.. ఇలాంటి ప్లాట్ లో ‘శేఖర్ హోమ్’ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం.

ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన వాచ్ లిస్ట్ లో.. ఆల్రెడీ ఈ సిరీస్ ను కూడా యాడ్ చేసుకుని ఉంటారు. శేఖర్ హోమ్ సిరీస్ ఆగష్టు 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మొదట ఈ సిరీస్ ను కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్. ఇప్పుడు హిందీతో పాటు.. తెలుగు, తమిళం , కన్నడ , బెంగాలీ, మరాఠి భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ సిరీస్ కు రోహన్ సిప్పీ, శ్రీజీత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 1990 బ్యాక్డ్రాప్ లో ఈ సిరీస్ ను తెరకెక్కించారు మేకర్స్. అసలు ఏ టెక్నాలజి లేని సమయంలో… ఓ ఇన్వెస్టిగేషన్ ను ఏ విధంగా చూపించారనేదే ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనుంది.కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సిరీస్ ను కూడా యాడ్ చేసుకోండి.

ఇక శేఖర్ హోమ్ కథ విషయానికొస్తే.. 1990 బ్యాక్డ్రాప్ లో ఈ కథ కొనసాగుతుంది.. వెస్ట్ బెంగాల్ లోని లోన్పూర్ అనే టౌన్ లో శేఖర్ , మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉంటూ ఉంటాడు. ఈ కథ అంతా కూడా అక్కడే జరిగినట్లు చూపించారు. శేఖర్ అదే ప్రాంతంలోని మిస్టరీలను ఛేదిస్తూ ఉంటాడు. అతను ఎలాంటి క్రైమ్ కేసులను సాల్వ్ చేస్తాడు? డిటెక్టీవ్ గా అతను ఏ విధంగా సమస్యలకు పరిష్కారాలు కే తెలియజేస్తాడు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments