OTT లో మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్, స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్

Samantha OTT Web Series: ఇప్పుడు వెండితెరపై అలరించిన నటి నటులంతా ఓటీటీ లవైపే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి సమంత మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Samantha OTT Web Series: ఇప్పుడు వెండితెరపై అలరించిన నటి నటులంతా ఓటీటీ లవైపే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి సమంత మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ నటి సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆఖరిగా సమంత విజయ్ దేవరకొండతో పాటు ఖుషి మూవీలో కనిపించింది. సమంత హెల్త్ కండిషన్ కారణంగా కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాల గురించైతే ఎటువంటి అప్ డేట్ లేదు. ఇక సమంత వెండి తెరపై కనిపించడంతో పాటు.. ఓటీటీ లోకు కొన్ని వెబ్ సిరీస్ లలో అలరించింది. ఆల్రెడీ రాజ్, డీకే లు దర్శకత్వం వహించిన “సిటాడెల్: హనీబన్నీ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు సమంత మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం రాజ్ , డీకే లు కలిసి డైరెక్ట్ చేసిన “సిటాడెల్: హనీబన్నీ” సిరీస్ గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. అయితే వెంటనే సమంత ఇదే డైరెక్టర్స్ తో మరొక సిరీస్ కు ఓకే చెప్పింది. అయితే ఈ వెబ్ సిరీస్ కు వీరిద్దరూ దర్శకులుగా కాకుండా షో రన్నర్స్ గా వ్యవహరించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ , సమంత మెయిన్ లీడ్స్ లో నటించనున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటి వామికా గబ్బీ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సిరీస్ కు “రక్త బ్రహ్మాండ్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ముందు దానికి రక్తబీజ్ అనే టైటిల్ ను అనుకున్నారట మేకర్స్.. కానీ దానిని రక్త బ్రహ్మాండ్ అనే ఫైనల్ చేశారు. ఇక ఈ సిరీస్ పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామా గా తెరకెక్కనుంది.

అయితే రక్తబీజ్ సిరీస్ కు.. తుంబాడ్ ఫేమ్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే.. డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. తుంబాడ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 లో వచ్చిన ఈ హర్రర్ మూవీకి విశేష ఆదరణ లభించింది. దీనితో ఫస్ట్ టైమ్ రాహి అనిల్ బార్వే ఒక సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ రక్తబ్రహ్మాండ్ సిరీస్ ను సినిమా రూపంలో రిలీజ్ చేయాలి అనుకున్నారట మేకర్స్. కానీ కథ మొత్తం చెప్పడం కష్టమని.. వెబ్ సిరీస్ రూపంలో తీసుకురానున్నారు. ఇందులో చాలానే ఇంట్రెస్టింగ్ అంశాలను చూపించనున్నారు. అలాగే ఈ సిరీస్ ను 2025 లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు . ఇంకా ఈ సిరీస్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments