Krishna Kowshik
పరాయి భాషలో హిట్ అయిన సినిమాలు రీమేక్ రూపంలో తీసుకు వస్తుంటారు దర్శక నిర్మాతలు. అలాంటి ఓ ఫీల్ గుడ్ మూవీ కూడా తెలుగులో మిస్ అయ్యింది. ఆ సినిమా వాచ్ చేయాలనుకుంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
పరాయి భాషలో హిట్ అయిన సినిమాలు రీమేక్ రూపంలో తీసుకు వస్తుంటారు దర్శక నిర్మాతలు. అలాంటి ఓ ఫీల్ గుడ్ మూవీ కూడా తెలుగులో మిస్ అయ్యింది. ఆ సినిమా వాచ్ చేయాలనుకుంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Krishna Kowshik
ఓ సినిమా హిట్ అయ్యిందంటే.. ఇతర భాషల్లో కూడా రీమేక్ అవ్వడం కామన్. అక్కడ కూడా హిట్ టాక్ పడితే.. మరో ఇండస్ట్రీని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సార్లు పట్టాలెక్కవు అంతే. ఇప్పుడు అలాంటి సినిమా గురించి చర్చించుకుందాం. మలయాళంలో హిట్ అందుకుని, తమిళంలో రీమేక్ అయ్యింది. తెలుగులో తీసేందుకు కూడా ప్లాన్ చేశారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత. ఈ సినిమా హక్కులు కూడా పొందారు. బడా హీరోలతో సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి స్టార్లు నటిస్తున్నారన్న టాక్ నడించింది. కానీ అనూహ్యంగా సినిమా రూపుదిద్దుకోలేదు. కానీ తీసుకుంటే.. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచేది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే.. బెంగళూరు డేస్/ బెంగళూరు నాట్కల్.
నివిన్ పౌలీ, దుల్కర్, పహాద్ ఫజిల్, నజ్రీయా నజీమ్, పార్వతి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన మలయాళ మూవీ బెంగళూరు డేస్. 2014లో కేవలం 8 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 45 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను తమిళ్, తెలుగులో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు ప్రముఖ నిర్మాతలు ప్రసాద్ వి పొట్లూరి, దిల్ రాజు. భాస్కర్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. బడా కాస్టింగ్ అనుకున్నారు. తమిళంలో 2016లో బెంగళూరు నాట్కల్ పేరుతో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆర్య, బాబీ సింహ, శ్రీ దివ్య, రానా, పార్వతి, లక్ష్మీ రాయ్ నటించగా.. సమంత క్యామియో పాత్రలో కనిపిస్తుంది. అక్కడ కూడా ఓకే అనిపించింది. కానీ తెలుగులో రీమేక్ చేద్దామనుకుని ఆగిపోయింది. ఇప్పుడు ఈ మూవీని చూడాలనుకుంటే… ఓటీటీలో చూసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది వాచ్ చేయొచ్చు.
ఇందులో రానా, సమంత లవర్స్‌గా నటించారు. ఇక కథ విషయానికి వస్తే బాబీ సింహ, ఆర్య, శ్రీదివ్య చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. ముగ్గురివి డిఫరెంట్ లైఫ్స్. దివ్యకు రానాకు పెళ్లి జరుగుతుంది. ఆమెకు ఎంబీఎ చేయాలని కోరిక.. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుంటుంది. అతడిది బెంగళూరు కావడంతో అక్కడికి వెళుతుంది. ఆర్య మెకానిక్ కమ్ బైక్ రేసర్. పెళ్లైన తర్వాత రానా.. శ్రీదివ్యను పట్టించుకోడు. అతడు మాత్రమే ఓ గదిలో ఉంటాడు. ఏం జరుగుతుందో శ్రీదివ్యకు అర్థం కాదు. అలాగే ఓ హెయిర్ హెస్టెస్ మాయలో పడి మోసపోతాడు బాబీ సింహ. ఆర్య కూడా రేసింగ్ విషయంలో ఇష్యూ జరిగి.. ఓ సంవత్సరం బ్యాన్‌కు గురౌతాడు. అంతలో ఓ రోజు రూం కీస్ మర్చిపోతాడు రానా. అప్పుడు రూంలోకి వెళ్లగానే.. సమంత ఫోటోలు కనిపిస్తాయి. దెబ్బకి షాకై పుట్టింటికి వస్తుంది. అక్కడ నుండి సినిమా హైప్ క్రియేట్ చేస్తుంది. ఇంతకు సమంత ఫోటోలు రానా ఇంట్లో ఉండటం ఏంటీ.. ఆమెమైందీ అనేది మిగిలిన స్టోరీ. మరెందుకు ఆలస్యం ఉచితంగా యూట్యూబ్‌లో.. సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి.