Prasannavadanam OTT: OTT లోకి ప్రసన్నవదనం మూవీ.. ఇంత త్వరగా వస్తుందని ఊహించి ఉండరు..

వారాలు నెలలు గడవకముందే సినిమాలన్నీ ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరొక సినిమా యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుందో చూసేద్దాం.

వారాలు నెలలు గడవకముందే సినిమాలన్నీ ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరొక సినిమా యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుందో చూసేద్దాం.

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే చాలా సమయం తీసుకునేవి. కానీ, ఇప్పుడు చాలా వరకు సినిమాలు ఏ రోజైతే థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో.. అదే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ కూడా డిసైడ్ అయిపోతున్నాయి. పైగా వారాలు నెలలు గడవక ముందే సినిమాలు ఓటీటీ లోకి రావడం గమనార్హం. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఆయా సినిమాలు ఓటీటీ కి రావాలంటే మాత్రం కనీసం నెల రోజులు సమయం పడుతుంది. లేదా ఆయా సినిమాల థియేట్రికల్ రన్ ను బట్టి.. కొన్ని సినిమాలు విడుదలైన నెల రోజులలోపే ఓటీటీ లో దర్శనం ఇచ్చేస్తుంటాయి. తాజాగా సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా కూడా అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా థియేటర్ లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. సుహాస్ కథల ఎంపిక ఎప్పుడు సరికొత్తగానే ఉంటుంది. ఒకవేళ కథలు రొటీన్ గా ఉన్నా కూడా.. సుహాస్ ఆ పాత్రలో జీవించడంతో ఆ కథలు సరికొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ప్రసన్న వదనం సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో సుహాస్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనితో ఎవరిని సరిగా గుర్తుపట్టలేకపోతాడు. కానీ, అతని సమస్యను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. అతనికి ఉన్న లోపం వలన ఆ హత్య చేసిన వారిని అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ దాని గురించి మాత్రం పోలీసులకు చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది! కథ ఎలా ముందుకు సాగింది ! అనేదే ఈ సినిమా కథ.

కథ ఎలా ఉన్నా కూడా సుహాస్ మాత్రం అందరిని ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. మే 3 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. అలాగే విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ కి ఇంత త్వరగా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ సినిమాను మే 24 నుంచి ఆహ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఓటీటీ లవర్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments